ప్రతీ విజయం మా బాధ్యతను పెంచుతోంది

సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి

చరిత్రాత్మక విజయం అందించిన బద్వేల్‌ ప్రజలకు కృతజ్ఞతలు

పోటీలో లేకున్నా టీడీపీ, జనసేన ప్రచారం చేశాయి

బీజేపీ, టీడీపీ, జనసేన కుట్రలను బద్వేల్‌ ప్రజలు తిప్పికొట్టారు

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధకు చరిత్రాత్మక విజయాన్ని అందించిన బద్వేల్‌ నియోజకవర్గ ప్రజలకు, ఓటర్లకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కృజ్ఞతలు తెలిపారు. జరిగిన ప్రతీ ఎన్నికలోనూ సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలు తమ ఆశీస్సులు మెండుగా అందించడమే కాకుండా.. భవిష్యత్తులో కూడా  సీఎం వైయస్‌ జగన్‌ వెంటనే ఉంటామని ప్రజలు తమ ఓట్ల ద్వారా మరోసారి చాటిచెప్పారన్నారు. ప్రతి ఎన్నిక బాధ్యతను పెంచుతుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై ప్రతిపక్ష పార్టీలు చేసే విషప్రచారాన్నీ ప్రజలు తిప్పికొట్టారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..

‘‘ఎన్నిక ఫలితం ఎలా ఉన్నా.. అది మన బాధ్యతను మరింత పెంచుతుంది. ఓటమి చెందినవారు లోపాలు, వెనకబడిన విధానాల గురించి ఆత్మపరిశీలన చేసుకుంటారు. గెలుపొందినవారు.. ప్రజల అంచనాలను అందుకోవడానికి మరింత కష్టపడేందుకు కృషిచేస్తారు. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉప ఎన్నికల్లో ప్రజలు వైయస్‌ జగన్‌కు మెండుగా ఆశీస్సులు అందిస్తున్నారు. ప్రజలందించే విజయాలతో మా బాధ్యత మరింత పెరుగుతుందని భావిస్తున్నాం. 

2019 ఎన్నికలకు ముందు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించిన వైయస్‌ఆర్‌ సీపీ.. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకొని అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అంతే వినమ్రతతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల సేవలో నిమగ్నమయ్యారు. అధికారమంటే ప్రజలకు సేవ చేయడమేనని ప్రతి అడుగులోనూ సీఎం చూపుతున్నారు. నాయకులు, కార్యకర్తలకు కూడా అదే చెబుతున్నారు. అందుకే క్రమశిక్షణ కలిగిన పార్టీగా వైయస్‌ఆర్‌ సీపీ ఎగింది. 

బద్వేల్‌ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినప్పటికీ అడుగడుగునా వారి పాత్ర కనిపించింది. మొదట్లో బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేస్తామని హడావుడి చేసిన టీడీపీ.. ఆఖరకు వ్యూహం మార్చి సంప్రదాయం పాటిస్తున్నాం అని స్టేట్‌మెంట్‌ ఇచ్చి చేతులు దులుపుకుంది. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా పోటీ చేయడం లేదని చెప్పారు. కానీ, ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని భుజాల మీద మోస్తూ వచ్చారు. ఆఖరకు ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌లలో ఏజెంట్లుగా కూడా కూర్చున్నారు. 281 బూతుల్లో కేవలం 10 బూతుల్లోనే బీజేపీ వారు ఉన్నారు. మిగిలినవాటిల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని మీడియాలో వచ్చింది. వారు కూడా దాన్ని ఖండించలేదు. జనసేన బలపర్చిన బీజేపీ అభ్యర్థిని ప్రకటనలు.. సోము వీ్రరాజు పక్కన పవన్‌ కల్యాణ్‌ ఫొటో కూడా పెట్టి బీజేపీ అధికారంగా ప్రకటన ఇచ్చింది. 

2019లో బీజేపీకి 800 లోపే ఓట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన ఘోర పరాభవం నుంచి తప్పించుకొని మాయా యుద్ధం చేశాయి. తమ బలాన్ని బీజేపీ వైపు మళ్లించారు. ఆఖరకు పోలింగ్‌ ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టారు. అయినా సరే ప్రజలు కృతనిశ్చయంతో సీఎం వైయస్‌ జగన్‌కు ఆశీస్సులు ఇచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ మతం, కులం పరంగా అన్ని రకాలు చిచ్చుపెట్టి.. డ్రగ్స్‌ మాఫియాను అంటగట్టడం, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారమంతా ఒట్టి అబద్ధమని, ఆ విషయం మీరు తేల్చాలంటే.. బూతులకు వచ్చి ఓట్లు వేయాలని మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి ప్రచారం చేశారు. దాని ఫలితంగా ఓటర్లు బూతులకు వచ్చి ఓట్లు వేశారు. పోలైన ఓట్లలో 76.23 శాతం వైయస్‌ఆర్‌ సీపీకి వేశారు. బీజేపీకి వచ్చిన 14 శాతం బీజేపీ, టీడీపీ, జనసేన కలిసిన ఓట్లు. 

ఆ మూడు పార్టీలు ఒకటే. సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు. లోపాయకారిగా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను ఓడించాలని రహస్యంగా మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి ఎన్నికకు ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగి.. తీర్పును వినమ్రంగా స్వీకరించండి అంటే అది వదిలేసి.. 2019లో చావుదెబ్బ కొట్టినా ఏ మాత్రం మారకపోగా.. టక్కుటమార విద్యలు, విషప్రచారం చేయడంతోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రజల్లోకి వచ్చే ధైర్యం లేక మీడియా పరమైన యుద్ధం చేస్తున్నారు. తెర వెనక నుంచి వచ్చినా, తెర ముందుకు వచ్చినా ఆ మూడు పార్టీలకు బద్వేలు ఎన్నికతో రుజువైంది’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
 

Back to Top