ఈనెల 26 నుంచి వైయస్‌ఆర్‌ సీపీ బస్సు యాత్ర

4 రోజుల పాటు యాత్ర.. పాల్గొననున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు, ముఖ్యనేతలు

తాడేపల్లి: ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ బస్సు యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. 26వ తేదీన శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్రలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు, వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. 26న శ్రీకాకుళం లేదా విజయనగరంలో బహిరంగ సభ నిర్వహించి.. రాత్రికి విశాఖలో బస చేస్తారు. అదే విధంగా 27న రాజమండ్రిలో సభ.. రాత్రికి తాడేపల్లిగూడెంలో బస చేస్తారు. 28న నరసరావుపేటలో బహిరంగ సభ.. రాత్రికి నంద్యాలలో బస చేస్తారు. 29న అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇస్తున్న అధిక ప్రాధాన్యత నేపథ్యంగా బస్సు యాత్ర కొనసాగనుంది. ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు, ప‌ద‌వుల్లో, ప‌నుల్లో క‌ల్పిస్తున్న‌ సామాజిక న్యాయం గురించి బ‌హిరంగ స‌భ‌ల్లో మంత్రులు, పార్టీ ముఖ్య నేత‌లు ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top