దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడానికి గ్రామ గ్రామాన సోష‌ల్ మీడియా సైన్యం ఏర్పాటు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా స్టేట్ కో-ఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద్రారెడ్డి

అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా వర్క్ షాప్

  తాడేప‌ల్లి: చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడితో కూడిన గజ దొంగల ముఠా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తిప్పికొట్టడానికి గ్రామ గ్రామాన సైన్యంగా ఏర్పడాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా స్టేట్ కో-ఆర్డినేట‌ర్ గుర్రంపాటి దేవేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు తాడేప‌ల్లిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వ‌హించారు. రెండో రోజుల పాటు నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర నలుమూలల నుంచి సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చారు. అత్యంత అట్టహాసంగా ప్రారంభ‌మైన కార్య‌క్ర‌మంలో దేవేంద్రారెడ్డి అధ్య‌క్ష ఉప‌న్యాసం  చేశారు.  


సీఎం వైయ‌స్ జ‌గ‌న‌న్నే మ‌న స్ఫూర్తి
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాట ప‌టిమే మ‌న స్ఫూర్తిగా ముందుకు వెళ్దామ‌ని స్టేట్ కో-ఆర్డినేట‌ర్ దేవేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ ప్లీన‌రీలోనే పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపునిచ్చార‌ని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను గెలుచుకోవడం సాధ్యమేని , ఇందుకోసం సోష‌ల్ మీడియా సైన్యం అలుపెర‌గ‌ని పోరాటాలు చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు. ప్ర‌తి కార్యకర్తల బాధ్యత సీఎం వైయస్‌ జగన్‌ తన భుజస్కందాల మీద వేసుకున్నార‌ని,  పార్టీ విజయాలకు మీరే కారణం, మీకు నేను అండగా ఉంటానన్న సీఎం వైయస్‌ జగన్ ఉద్ఘాటించార‌ని గుర్తు చేశారు. 

ఊరూరా సోష‌ల్ మీడియా సైన్యం..

రాష్ట్రంలో ఉన్న దుష్ట చ‌తుష్ట‌యాన్ని ఎదుర్కొనేందుకు ఊరూరా వైయస్‌ఆర్‌సీపీ సోషల్‌ మీడియా సైన్యం తయారు చేద్దామ‌ని దేవేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మూడేళ్ల పాలనలో ప్రభుత్వ విజయాలను ఆయ‌న‌ వివరించారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా ఓటేసినట్లేనని ప్రజలకు వివరించాలని చెప్పారు. చంద్రబాబుతో కూడిన కౌరవ సైన్యంపై గెలిచేందుకు అర్జునుడి పాత్ర పోషించాల్సింది సోష‌ల్ మీడియానేన‌ని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మహాయజ్ఞం జరుగుతుంద‌ని, మరో 30 సంవత్సరాల భవిష్యత్తుకు కావాల్సిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా అభ్యుదయ మూలాలకు మూడు సంవత్సరాల్లో అడుగులు పడ్డాయ‌న్నారు. ఇది మరింతగా బలపడాలంటే అందులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సోష‌ల్ మీడియా కార్యకర్తల పాత్ర చాలా కీలకమ‌ని గుర్తు చేశారు.  వైయస్‌ఆర్‌సీపీ పైనా, వైయస్‌ జగన్ గారి పైనా నీచపు రాతలు రాసేందుకు వేలమందిని నియమించి 24/7 కాల్ సెంటర్లను నిర్వహించినా వారి కుట్ర‌ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా తిప్పికొడ‌దామ‌ని దేవేంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,  వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా స్టేట్ కో-ఆర్డినేట‌ర్లు పుత్తా శివ‌శంక‌ర్‌రెడ్డి, చ‌ల్లా మ‌ధుసుద‌న్‌రెడ్డి, పామిరెడ్డి మ‌ధుసుద‌న్‌రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top