చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసిన ప్రజలు ఆయనను నమ్మరు 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి

ఒంగోలు:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు త‌ల‌క్రింద‌లుగా త‌ప‌స్సు చేసిన ప్ర‌జ‌లు ఆయ‌న్ను న‌మ్మ‌ర‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నిన్న క‌ర్నూలు స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడిన మాట‌ల‌ను వైవీ సుబ్బారెడ్డి త‌ప్పుప‌ట్టారు.ఇవాళ ఒంగోలు లో వైవీ సుబ్బారెడ్డి  మీడియాతో మాట్లాడారు.  ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ వాస్తవమేనని, 2024 ఎన్నికలే టీడీపీకి, చంద్రబాబుకు ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌న్నారు.  చంద్రబాబు మాటలను బట్టి, ఎన్నికలకు ఏడాదిన్నర ముందే తన ఓటమిని అంగీకరించాడని తెలిపారు. 14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన వ్య‌క్తి..తాను ఏం చేశాడో ప్ర‌జ‌ల‌ను చెప్పి ఓట్లు అడ‌గాలి కానీ, మీరే న‌న్ను అసెంబ్లీకి పంపించండి..లేదంటే ఇవే చివ‌రి ఎన్నిక‌లు అని చంద్ర‌బాబు మాట్లాడుతున్నారంటే ఆయ‌న ప‌రిస్థితి ఏంటో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రజలు ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు. విడిపోయిన రాష్ట్రాన్ని గ‌త ఐదేళ్లు చంద్రబాబు ఎలా పాలించాడు, నాలుగేళ్లుగా సీఎం వైయస్‌ జగన్ ఎలా పాలిస్తున్నార‌న్న‌ది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, చంద్ర‌బాబుకు గుడ్ బై చెప్పే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌ని వైవీ సుబ్బారెడ్డి కామెంట్ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top