అంద‌రూ నీ తండ్రి చంద్ర‌బాబులా ఉండ‌రు కదా లోకేష్‌!

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీ ట్వీట్‌ 

 తాడేప‌ల్లి:  చంద్ర‌బాబును  జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయ‌ని టీడీపీ నేత నారా లోకేష్ చేసిన ట్వీట్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. నారా లోకేష్‌.. నువ్వు చెప్పిన‌ గంజేటి వీరవెంకట సత్యనారాయణ అనే ఖైదీ ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఈనెల 7నే ఆసుప‌త్రికి తీసుకెళ్ళారు. అయినా అత‌ను నిన్న‌ డెంగ్యూతో మృతి చెందాడు. ఈ విష‌యం మీద జైళ్ళ‌ శాఖ డీఐజీ వివ‌రణ ఇచ్చారు. జైలులో దోమ‌ల లార్వా ఆన‌వాళ్ళు ఏమీ లేవ‌ని కూడా స్ప‌ష్టంగా చెప్పారు. ఇక నీ తండ్రి చంద్ర‌బాబు నాయుడిని ప్ర‌త్యేక ఖైదీగా గుర్తించి ఎవ‌రికీ క‌ల్పించ‌న‌న్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తోంది ప్ర‌భుత్వం. అంతే త‌ప్ప 73 ఏళ్ళ వ్య‌క్తిని హ‌త్య చేసి, రాజ‌కీయ ల‌బ్ధిపొందాల‌ని ఇక్కడ ఎవరూ చూడటలేదు. అయినా అంద‌రూ నీ తండ్రి చంద్ర‌బాబులా ఉండ‌రు కదా! లోకేష్ అంటూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీ ట్వీట్ చేసింది

Back to Top