బ్యాంకుల‌ను ముంచిన స్కామ్‌ స్టార్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

రఘురామకృష్ణరాజుపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండి

లోక్‌స‌భ‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి డిమాండ్

భారత్‌ థర్మల్‌ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

ఢిల్లీ: బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు దోచిన స్కామ్ స్టార్ రఘురామకృష్ణరాజు అని, భారత్‌ థర్మల్‌ పేరుతో రఘురామ తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని లోక్‌స‌భ‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలపై ఎంపీ మిథున్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. లోక్‌స‌భ‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే.. ‘సభలో నిరాధార, అసత్య ఆరోపణలు చేయడం ఏ మాత్రం సరికాదు. రఘురామకృష్ణరాజు రాష్ట్రానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. వాస్తవానికి రఘురామకృష్ణరాజుపై రెండు సీబీఐ కేసులు నమోదై ఉన్నాయి. ఆయన బ్యాంకులను మోసం చేశాడు. వాటి నుంచి బయటపడటం కోసం కేంద్రంలోని అధికార(బీజేపీ) పార్టీలో చేరే ప్రయత్నం చేస్తున్నాడు. అతను మా పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. ఈ విషయాని ప్రతి ఒక్కరూ గమనించాలి. బ్యాంకులను మోసం చేశాడు కాబట్టి, ఆ కేసుల నుంచి బయట పడడానికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల నేను మీ (స్పీకర్‌ ఛైర్‌) ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు మీద ఉన్న కేసులను వీలైనంత త్వరగా తేల్చండి. భారత్‌ థర్మల్‌ పేరుతో ఆయన తీసుకున్న వేల కోట్ల రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయండి’  అని ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top