భారత్‌ బంద్‌కు వైయ‌స్ఆర్ సీపీ సంపూర్ణ మద్దతు

కృష్ణా జిల్లా: వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్‌ బంద్‌కు వైయ‌స్ఆర్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌లో భాగంగా 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ మ‌ధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆర్టీసీ బస్సులు నడవవు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని మంత్రి పేర్ని నాని తెలిపారు. రైతు సంఘాలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కును కార్పోరేట్‌ శక్తులకు అమ్మొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని పేర్ని నాని విన్నవించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top