వేడుక‌గా వైయ‌స్ఆర్‌సీపీ ఆవిర్భావం

రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణుల సంబ‌రాలు

వాడవాడలా వైయ‌స్ఆర్‌సీపీ జెండా రెపరెపలు

మ‌హానేత విగ్ర‌హాల‌కు నివాళులు

సేవా కార్య‌క్ర‌మాల్లో పార్టీ శ్రేణులు

అమ‌రావ‌తి: ప్రజాహితం కోసం వెలిసి.. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ) పన్నెండవ వసంతంలోకి అడుగుపెట్టింది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. వాడవాడలా వైయ‌స్ఆర్‌సీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ జెండాను వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఎగుర‌వేశారు. వేడుక‌ల్లో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి, మంత్రులు ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌, ఆదిమూల‌పు సురేష్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 


వైయ‌స్ జగన్‌ అంటే సంక్షేమం: ఉమ్మారెడ్డి
తాడేపల్లి: దేశ వ్యాప్తంగా బేరీజు వేస్తే ఇతరులు సాధించడానికి ఏమీ లేకుండా మనం సాధించాం. మొన్నటి ఎన్నికల్లో స్థానిక సంస్థల్లోనూ 90 శాతం మనకే వచ్చాయి. ఆఖరికి కుప్పంలో కూడా విజయదుందిబి మోగించాం అన్నారు పొలిట్ బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.

రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సంక్షేమం అంటే వైయ‌స్ జగన్...జగన్ అంటే సంక్షేమం. ఎన్నో కష్టాలు పెట్టినా జగన్ వేరవలేదు..ఇప్పుడు రాష్ట్రమంతా జగన్ అంటున్నారు.మొన్నటి ఎన్నికలలో వచ్చిన దానికంటే మరింత ముందుకు వెళ్ళాలని కార్యకర్తలకు ఉమ్మారెడ్డి పిలుపు ఇచ్చారు. 

వైయ‌స్ జగన్‌.. సమర్థుడైన సీఎం: డిప్యూటీ సీఎం ధర్మాన

  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ నడుస్తోంది. ఒక సమర్థమైన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిరూపించుకున్నారు. మనమంతా ప్రజల కోసం సమైక్యంగా ముందుకు నడవాలి. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా తుది దశకు వచ్చాయి. మన నాయకుడు ఆలోచన అందరికీ న్యాయం చేయడమే అన్నారు ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్.

కష్టపడదాం.. జనకాంక్షను నెరవేర్చుదాం:  మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

వైఎస్ జగన్ నాయకత్వంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మంత్రి అదిమూలపు సురేష్ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.  అతి కొద్ది కాలంలోనే మనం అధికారం లోకి వచ్చాం. రాష్ట్ర ప్రజలంతా మన పార్టీ వైపు చూస్తున్నారు. నవరత్నాల్లాంటి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తోంది. ప్రతి కార్యకర్త కష్టమే పార్టీ ఇంత బలంగా ఉండటానికి కారణం. ఎవరినీ పార్టీ మర్చిపోదు... అందరికీ సమన్యాయం జరుగుతుంది. పార్టీ బలోపేతానికి పునరంకితం అవుదాం. రానున్న రోజుల్లో పార్టీని అధికారంలో నిలబెట్టేలా కష్టపడదాం. వైఎస్ జగన్ మూడు దశాబ్దాలు సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పారు విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్.


 
పేదల సంక్షేమ కోసమే సీఎం వైయ‌స్ జగన్‌ పాలన: బాలినేని
ప్రజల మధ్యనే పుట్టిన పార్టీ వైయ‌స్ఆర్‌సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులకు బాలినేని శుభాకాంక్షలు తెలిపారు.

ఎన్నో కష్టాలు పడి పార్టీని వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి తెచ్చారని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి జగన్ పాలన చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని గుర్తుచేశారు. మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.

  శ్రీ‌కాకుళంలో.. 
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీ‌కాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 
  గుంటూరు జిల్లాలో..
  వినుకొండ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు.
నరసరావుపేట: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.  
మంగళగిరి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పాల్గొన్నారు.
సత్తెనపల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కేక్ కట్ చేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
గుంటూరు ఈస్ట్: గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే ముస్తఫా ఆవిష్కరించారు.
చిలకలూరిపేట: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని పార్టీ జెండాను ఆవిష్కరించారు. 


 
ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా..
  తణుకు నియోజకవర్గంలో ఘనంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయం వద్ద  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆవిష్కరించారు. తణుకు నియోజకవర్గం మూడు మండలాల నుంచి భారీగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్‌లో గల వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి  ఎమ్మెల్యే కారుమూరి
 నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భవ దినోత్సం సందర్భంగా పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

 
కర్నూలు జిల్లాలో..
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బ్రహ్మణకొట్కూరు, నందికొట్కూరులో దిగవంత నేత డా.వైయ‌స్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఆర్థర్‌ నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. హాస్పిటల్‌లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు.
శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలోని ఆత్మ‌కూరులో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఎమ్మెల్యే శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో పేద‌ల‌కు పండ్లు, బెడ్డు పంపిణీ చేశారు.

 
పార్టీ జెండాని మోసిన ప్రతీ ఒక్కరికీ న్యాయం: కాకాణి

వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా  నెల్లూరు  మాగుంట లేఅవుట్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి  విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించిన సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

వైయ‌స్ జగన్ సాహసోపేత నిర్ణయంతోనే పార్టీ ఆవిర్భవించింది. ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా సంక్షేమాన్ని సీఎం జగన్ అందిస్తున్నారు. రోజురోజుకీ జగన్‌ పాలనకి జనాల్లో ఆదరణ పెరుగుతోంది. రాష్ట్రానికి వైఎస్ జగన్ శాశ్వత ముఖ్యమంత్రి. పార్టీ జెండాని మోసిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తాం అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. 

 విద్యార్థులకు పండ్లు, దుప్పట్ల పంపిణీ

వైయ‌స్ఆర్‌ సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్థానిక విశ్వభారతి అంధుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు, బ్రెడ్, దుప్పట్లు పంపిణీ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top