టీడీపీ గుర్తింపు ర‌ద్దు చేయాలి

న్యూఢిల్లీ:  తెలుగు దేశం పార్టీ గుర్తింపును ర‌ద్దు చేయాల‌ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి డిమాండు చేశారు. మంగ‌ళ‌వారం విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతపత్రం సమర్పించారు. క‌లిశారు. ఇటీవ‌ల టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఎంపీలు రాష్ట్ర‌ప‌తికి వినిపించారు.  ప్ర‌తిప‌క్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిపై  ఉపయోగించిన నీచమైన భాషను ఆయనకు వివరించారు.  

Back to Top