2024 ఎన్నికల్లో చంద్రబాబుకి మరోసారి పరాభవం తప్పదు

చీరాల అసెంబ్లీ నియోజకవర్గ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇన్‌ చార్జి  కరణం వెంకటేష్ 

బాబు, లోకేష్‌... దొందూ దొందే...!

కుటిల రాజకీయ పార్టీలకు ఈ రాష్ట్రంలో స్థానం లేదు

ఒంటరిగా పోటీ చేసే దమ్మూ, ధైర్యం ఆ పార్టీలకు లేదు

తాడేపల్లి : చంద్రబాబు కుప్పంలో.. లోకేష్‌ మంగళగిరిలో గెలిచే పరిస్థితి లేదని.. తండ్రీ కొడుకుల రాజకీయ భవిష్యత్తు దొందూ దొందే.. అన్నట్టుగా తయారైందని  చీరాల అసెంబ్లీ నియోజకవర్గ వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఇన్‌ చార్జి  కరణం వెంకటేష్‌ అన్నారు. 14 ఏళ్ళు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో కనీసం అవగాహన లేని, స్పష్టత లేని నాయకుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.  వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆయనను ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. అధికారం లేదు అన్న ఒకే ఒక్క అక్కసుతో.. చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్‌ కల్యాణ్‌ లు.. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రజా ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని, వీరి కుట్రలను ప్రజలే తిప్పికొడతారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, 2024 ఎన్నికల్లో జగన్‌ మోహన్‌ రెడ్డిగారికే అధికారం తథ్యం అని కరణం వెంకటేష్‌ అన్నారు. 

వెంకటేష్‌ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే, ఆయన మాటల్లోనే..

  •   2019 నుంచి గడచిన మూడున్నరేళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగే పరిణామాలు.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది.  కోవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో బడుగు, బలహీనవర్గాలు, పార్టీలు, కుల,మతాలకతీతంగా లబ్ధి పొందారు.  దీంతో అధికారంలో లేమనే ఒకే ఒక్క అక్కస్సుతో టీడీపీ–ఎల్లో మీడియా కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తున్నాయి. 
  •   రాజకీయాల్లో 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నారా చంద్రబాబుకు కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు.  అదేవిధంగా ఆయన కొడుకు లోకేష్‌  మంగళగిరిలోనూ గెలవలేడు. అటు చంద్రబాబుది, ఇటు లోకేష్‌ది ఒకే పరిస్థితిగా ఉంది.  రాష్ట్రాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలో అవగాహన లేని నాయకుడు చంద్రబాబు. ఆయన కొడుకు భవిష్యత్‌ ఏంటో కూడా తెలియక పొత్తుల కోసం వారికాళ్ళూ, వీరి కాళ్ళూ పట్టుకుంటున్నాడు. 
  •  వారితో పాటు ఈ మధ్య మరో రాజకీయ పార్టీ అంటూ పవన్‌కల్యాణ్‌ ఏవిధంగా మాట్లాడుతున్నారనేది ప్రజలు చూస్తున్నారు. అవినీతికి ఆస్కారమే లేకుండా, ప్రతి పైసా పారదర్శకంగా ఖర్చు చేస్తుంటే.. జగనన్న కాలనీల్లో జరుగుతున్న ఇళ్ళ నిర్మాణంలో అవినీతి అని పవన్‌ చేస్తున్న విమర్శల్లో అర్థం లేదు. 
  •   ఉద్యోగాల నియామకం విషయానికొస్తే..  ముఖ్యమంత్రి జగన్‌ గారు తెచ్చిన సచివాయలవ్యవస్థతో దాదాపు 4 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించి,  అద్భుతమైన పరిపాలనా సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి.. 
  •  ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ పేదవాడి కుటుంబంలో.. ఇంటికి పెద్ద కొడుకుగా, వారికి అండగా నిలిచారు ముఖ్యమంత్రి జగన్‌ గారు. 
  •  వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్‌సీపీకే పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది వాస్తవం. అయితే, ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఒక  అభద్రతాభావంతో ప్రజల్లో లేనిపోని అపోహలను క్రియేట్‌ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్లు ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ప్రజలు వారి ఎత్తుగడలను  గమనిస్తున్నారు. 
  •   మేము గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి వెళితే.. సంక్షేమ పథకాల అమలు తీరు పట్ల  ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానంతో మమ్మల్ని స్వాగతిస్తున్నారు. 
  •   కుళ్లు,కుంతత్రంతో కుటిల రాజకీయాలు చేసే పార్టీలకు తగిన మూల్యం తప్పదు. ఒక్క డీబీటీ ద్వారానే రాష్ట్రంలోని పేద కుటుంబాలకు రూ. ఒక లక్షా75 వేల కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్‌లలో వేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఇదొక అరుదైన చరిత్ర.
  •   వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి మరోసారి మద్దతు తెలపడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. దాంతో ఇప్పుడు ప్రతిపక్షాలు పొత్తుల కోసమని వెంపర్లాడుతున్నాయి. జనం ముందు ఒకరకంగా వెనకాల ఒకరకంగా ఉంటారు. 2014లో పొత్తు అంటారు.తర్వాత వాళ్లు వాళ్లు తిట్టుకున్నారు. 2019లో మళ్ళీ పొత్తు లేదంటారు. మరలా 2024లో పొత్తు పెట్టుకుంటామని చెప్పుకుంటున్నారు. ఆ విషయం కూడా డైరెక్టుగా చెప్పే దమ్మూధైర్యం లేదు. అసలు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం ఎవరనేది అడుగుతున్నాను...? చంద్రబాబునా..? పవన్‌నా..?
  •   175 స్థానాలకు  175 పోటీచేస్తామని చెప్పే ధైర్యం ఎవరికుంది..? 
  •   సంక్షేమ పథకాల ద్వారా..  దేశవ్యాప్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్‌ ఒక మార్కుగా నిలబడింది. కేవలం అధికారం కోసం టీడీపీ పాలకులాడుతుంది. 
  •  మాకు పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రధాని ముందే కుండబద్ధలు కొట్టినట్టు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌ గారు. 
  •   కుట్రలు, కుతంత్రాలే తమ అజెండాగా బతుకుతున్న చంద్రబాబు, పవన్, లోకేష్‌ లు ఒంటరిగా మిగిలిపోతారు.
  •  చంద్రబాబ స్పష్టత లేని నాయకుడు. రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా తెలియని నాయకుడు. ఆయనకు ఒక కార్యచరణ లేదు. విజన్ లేదు. 
  • కేవలం బురదజల్లడానికి మాత్రమే.. ఆయన, ఆయన కొడుకు లోకేష్, పవన్‌లు పనిచేస్తున్నారు. 
  •   పేద, బడుగుబలహీనవర్గాలకు అండగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి గారిని ప్రజలకు దూరం చేసేందుకు వీళ్ళంతా చేస్తున్న కుట్రలు ఫలించవు. వారి దుష్ప్రచారాలను యువత, మహిళలు తిప్పికొడతారు.  – 2024లో కూడా శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారినే ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారు.
  •  
Back to Top