వైయ‌స్ఆర్‌  ఆశయ సాధన కోసం పనిచేస్తున్నాం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీ :  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నామ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైయ‌స్సార్‌ ఆశయాలను అమలు చేస్తున్నారని తెలిపారు.  గురువారం బాల సహయోగ్‌లో జరిగిన వైయ‌స్సార్‌ జయంతి వేడుకల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయ‌స్సార్‌ తన పాలనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా వైయ‌స్సార్‌ పాలన చేశార‌ని గుర్తు చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top