వైయ‌స్‌ వివేకానంద‌రెడ్డి మృతిపై అనుమానం

 హఠాన్మరణంపై పోలీసుల‌కు ఫిర్యాదు
 

 పులివెందుల : మాజీ మంత్రి వైయ‌స్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ మేర‌కు ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలపై గాయం ఉండటం.. చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివేకానందరెడ్డి భౌతికకాయానికి పోస్ట్‌ మార్టం నిర్వహించనున్నారు. గురువారం ప్రచారం ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసిన తర్వాత ఒక్కరే ఇంట్లో ఉన్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బాత్‌రూంలో రక్తపు మడుగులో పడిఉండటాన్ని పనివారు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయన అకాల మరణంపై అనుమానం వ్యక్తం అవుతోంది. 

దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి సోదరుడైన వైయ‌స్‌ వివేకానందరెడ్డి శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో పులివెందుల్లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణంతో కడప జిల్లాతో పాటు, వైయ‌స్ఆర్‌ కుటుంబ అభిమానుల్లో విషాద ఛాయలు నింపింది

 
 

Back to Top