వచ్చేది మన ప్రభుత్వమే..ధైర్యంగా ఉండండి

చంద్రబాబుకు ఓటేస్తే ఏపీ చాలా కోల్పోవలసి వస్తుంది..

విజ్ఞతతో ఓటు వేయండి

వైయస్‌ జగన్‌ సారథ్యంలో రాజన్న స్వర్ణయుగాన్ని తెచ్చుకుందాం..

ఈ ఎన్నికలు చారిత్రాత్మకమైన ఎన్నికలు

ఆళ్లగడ్డ ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

కర్నూలు జిల్లా: చంద్రబాబు పాలనలో జరిగింది అభివృద్ధి కాదు...అన్యాయం,మోసం,అవినీతి,ప్రలోభాలు..మళ్లీ  చంద్రబాబుకు ఓటేస్తే మన రాష్ట్రం చాలా నష్టపోవాల్సి వుంటుంది.ఒకసారి వైయస్‌ఆర్‌ సువర్ణ పాలన గుర్తుచేసుకుని ఓటు వేయాలని వైయస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పిలుపునిచ్చారు.ఆమె ఆళ్లగడ్డలో ఎన్నికల ప్రచారం చివరి సభలో ఆమె మాట్లాడారు.

ప్రసంగం ఆమె మాటల్లోనే..

ఒకసారి వైయస్‌ఆర్‌  సుపరిపాలనను గుర్తుకుతెచ్చుకోవాలి.గత ఎన్నికల్లో టీడీపీ ఓటువేసి  చాలా మోసపోయాం.చంద్రబాబు మోసాలు,హామీలతో ప్రజలను మోసం చేశాడు. ధర్మానికి,అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది. విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలి.వైయస్‌ఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య 40 సంవత్సరాలు అనుబంధం ఉంది. వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సంక్షేమ పథకాలు అమలుచేశారు.జలయజ్ఞం ద్వారా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించారు.రైతును రాజును చేయాలని అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు.  ప్రాజెక్టులను 80 శాతం వరుకు పూర్తిచేశారు.రెండు రూపాయలకే బియ్యం ఇచ్చారు. పేదలు అనారోగ్యంతో అప్పులపాలు కాకూడదని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు.లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు చేయించి ప్రాణాలు నిలబెట్టారు. అదేవిధంగా 108,104 అంబులెన్స్‌లు ప్రవేశపెట్టి ఎందరో ప్రాణాలను కాపాడారు.పేదలు ఉన్నత చదువులు చదవాలని ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టి ఎందరినో ఉన్నత ఉద్యోగాల్లో నిలబెట్టారు.ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్‌ఆర్‌దే.కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు గ్యాస్‌ ధర పెంచితే..అక్కాచెల్లెమ్మలకు భారం కాకూడదని ఆ భారాన్ని వైయస్‌ఆర్‌ ప్రభుత్వమే భరించింది.వైయస్‌ఆర్‌ హయాంలో 71 లక్షల మందికి పెన్షన్‌ ఇచ్చింది.

వైయస్‌ఆర్‌ ప్రభుత్వం కుల,మత,పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అందించారు.వైయస్‌ఆర్‌ హయాంలో ఎటువంటి చార్జీలు,ట్యాక్స్‌లు పెంచలేదు. ఒక పైసాకూడా పెంచకుండా సంక్షేమ పథకాలు అమలుచేశారు.వైయస్‌ఆర్‌ 2009 ఎన్నికల్లో అభివృద్ధినిచూసి ఓటు వేయమని అడిగారు.వైయస్‌ఆర్‌ మరణం తర్వాత వైయస్‌ జగన్‌ ప్రజలతోనే ఉన్నాడు.వైయస్‌ఆర్‌ మరణంతో వందల గుండెలు ఆగిపోయాయి.మరణించిన కుటుంబాలకు ఓదార్చడానికి  వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు.వైయస్‌ జగన్‌ చేపట్టిన ఓదార్పుయాత్ర కాంగ్రెస్‌కు నచ్చలేదు. అనుమతి ఇవ్వలేదు.వైయస్‌ జగన్‌ ప్రజల కిచ్చిన మాట కోసం సోనియాగాంధీని ధిక్కరించి ఓదార్పు యాత్ర కోసం కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు.వైయస జగన్‌ను ప్రజలు ఎంతో ఆదరించారు.వైయస్‌ జగన్‌పై కాంగ్రెస్,టీడీపీలు అనేక కుట్రలు చేశారు.సీబీఐ,ఈడి దాడులు చేయించి..ఆస్తులను అటాచ్‌ చేయించారు. రకరకాలుగా వేధించారు.చివరకు వైయస్‌ జగన్‌ను విచారణ పేరుతో పిలిచి జైల్లో పెట్టారు.ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు.

గల్లి నుంచి ఢిల్లీ వరుకు పోరాటాలు చేశారు. కడుపుమాడ్చుకుని ప్రజలు కోసం పోరాడారు.తొమ్మిది సంవత్సరాల్లో కాంగ్రెస్,టీడీపీలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా..తన కష్టం ఎప్పడూ ప్రజలకు చెప్పుకోలేదు. ప్రజల కష్టాలే పంచుకున్నారు.వైయస్‌ జగన్‌ మాట ఇస్తే చేస్తాడు..సాధిస్తాడు. వైయస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా మీ కష్టాలు,బాధలు చూశారు..విన్నారు.. మీకు అండగా ఉంటారు.వైయస్‌ఆర్‌ బతికుండగా నేను ఎప్పుడూ బయటకు రాలేదు.వైయస్‌ జగన్‌ను జైల్లో పెట్టినప్పుడు బయటకు రావాల్సి వచ్చింది.18 ఎమ్మెల్యేలను ,ఒక ఎ ంపీని గెలిపించుకోవడానికి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు జగన్‌ను తల్లికాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు.నేడు రాహుల్‌తో కలిసిన చంద్రబాబు..  బీజేపీ,కేసీఆర్‌తో జగన్‌ కలిశాడంటూ దుష్ఫ్రచారం చేస్తున్నాడు. వైయస్‌జగన్‌ ఎన్నాడూ ఎవరితోనూ కలవలేదు.. ఒంటరిగానే పోటిచేస్తాడు. 25 ఎంపీలను గెలుపించుకుని ప్రత్యేకహోదా సాధించుకుందాం.వైయస్‌ జగన్‌కు  ఓటు వేస్తే మరణశాసనమంటూ చంద్రబాబు  ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.జగన్‌ ఓదార్పు యాత్ర చేయడం అరాచకమా..పార్టీ ఫిరాయింపు చట్టానికి విలువ ఇవ్వడం అరాచకత్వమా...విలువలతో కూడిన రాజకీయాలు అరాచకత్వమా..చంద్రబాబు 17 కేసుల్లో స్టేలు తెచ్చుకుని బతుకుతున్నాడు.వైయస్‌ జగన్‌పై అక్రమంగా 31 కేసులను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. పదహారు నెలలు జైల్లో పెట్టారు.కాని మమ్మల్ని ఎప్పుడూ ఒక మాట అనలేదు. అది అరాచకత్వమా.. వైజాగ్‌ ఎయిర్‌పోర్ట్‌లో వైయస్‌ జగన్‌ హత్యా చేయాలని ప్రయత్నించారు. వైయస్‌ జగన్‌ బయటకు వచ్చిన  సమన్వయకం పాటించాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. అది అరాచకత్వమా..చంద్రబాబు మాదిరి వాగ్ధానాలు  చేయకపోవడం అరాచకత్వమా.

.ప్రత్యేకహోదా,సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయడం అరాచకత్వమా.. పాదయాత్ర చేసి కోట్ల మంది ప్రజల  సమస్యలు తెలుసుకోవడం అరాచకత్వమా అని అడుగుతున్నా..మళ్లీ రాజన్న రాజ్యం తీసుకువస్తానని, నవరత్నాలను ప్రతి ఇంటికి అందజేస్తానని చెప్పడం అరాచకత్వమా అని అడుగుతున్నా..ఒక సారి ప్రజలు ఆలోచించాలి. నా కుమారుడు రౌడీ కాదు..వైయస్‌ఆర్,వైయస్‌ జగన్‌లు ప్రేమను పంచేవారు కాని హత్యలు చేసేవారు కాదు..మామ రాజారెడ్డిని చంపిదెవరో,వారికి ఆశ్రయం ఇచ్చింది ఎవరో తెలుసు కాని..ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఏ ఒక చర్య కూడా తీసుకోలేదు.చట్టం తన పని చేసుకుపోతుందని వైయస్‌ఆర్‌ నిబద్ధతతో వ్యవహరించారన్నారు.  విజ్ఞతతో ఆలోచించాలి.మళ్లీ మోసపోవద్దు. ఎమ్మెల్యే అభ్యర్థి గా గంగుల విజయేంద్రరెడ్డి, అభ్యర్థిగా బ్రహ్మనందరెడ్డి నిలబెడుతున్నారు..మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరుతున్నా..ఒకసారి వైయస్‌ఆర్‌ పాలనను గుర్తుతెచ్చుకోండి. మంచి ప్రభుత్వం తెచ్చుకుందాం.రాజన్న స్వర్ణయుగం తెచ్చుకుందాం.ఎన్నికలు చారిత్రాత్మకమైన ఎన్నికలు.

ఈ సారి తప్పుచేస్తే సరిదిద్దుకోలేని తప్పు అవుతుంది. ఏపీ చాలా కోల్పోవలసి వస్తుంది.నేడు జరుగుతుంది.. అన్యాయం,మోసం,ప్రలోభం జరుగుతుంది.చంద్రబాబుకు ప్రలోభపడవద్దని మేల్కోనాలని కోరుతున్నా...వైయస్‌ జగన్‌ను ప్రేమించే అవ్వతాతలు,యువత,అక్కచెల్లెమ్మలు,అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నా..వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుగంగ పంట కాల్వలు పూర్తిచేస్తాం. కేసీ కెనాల్‌ లైనింగ్‌ పనులు పూర్తిచేస్తాం.ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తాం. ఆళ్లగడ్డ మున్సిపాల్టీలో ఎంతో అవినీతి జరిగింది. పేదల డబ్బు దోచుకున్నారు.వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపించి దోషులను శిక్షిస్తాం.వచ్చేది మన ప్రభుత్వం.కాబట్టి  అందరూ ధైర్యం ఉండాలని కోరుతున్నా.. 

Back to Top