చంద్రబాబును నమ్మొద్దు..

ప్రజలకు మేలు జరగాలంటే జగన్‌ రావాలి

ఈ ఎన్నికలు విశ్వసనీయత,అవకాశవాదానికి మధ్య యుద్ధం

ఒకసారి వైయస్‌ఆర్‌ పాలనను గుర్తుచేసుకోండి

రాష్ట్రాన్ని చంద్రబాబు దోచేశారు..

ప్రత్తిపాడు ఎన్నికల సభలో వైయస్‌ విజయమ్మ

 

తూర్పుగోదావరి:చంద్రబాబును నమ్మొద్దని, ప్రజలకు మేలు జరగాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలని వైయస్‌ విజయమ్మ అన్నారు. ఆమె ప్రత్తిపాడు ఎన్నికల సభలో మట్లాడారు.

ప్రసంగం ఆమె మాట్లలోనే..

గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసి మోసపోయాం. అనేక అబద్ధపు వాగ్ధానాలు ఇచ్చి ప్రజలను వంచించారు.న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది.విశ్వసనీయత,అవకాశవాదానికి మధ్య యుద్ధం జరుగుతుంది.విలువలకు,విశ్వసనీయతకు పట్టం కట్టాలి.2009లో ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ తనచేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని ప్రజలను అడిగారు.ప్రతి ఒక్కరూ వైయస్‌ఆర్‌ పాలన గుర్తుతెచ్చుకోవాలి.వైయస్‌ఆర్‌ 1978లో ఎమ్మెల్యే అయ్యారు.2004లో ముఖ్యమంత్రి అయ్యారు.ప్రతి జిల్లా వందల సార్లు వెళ్ళిన సందర్భాలు ఉన్నారు. వైయస్‌ఆర్‌కు లక్షల మందిని పేరుతో పిలిచే చనువు వుండేది. జిల్లాకు వెళ్ళినప్పుడు ప్రజలకు ఏమీచేయాలనేది ఆయన మైండ్‌లో బ్లూప్రింట్‌  ఉందేమో..వైయస్‌ఆర్‌ హయాంలో వ్యవసాయాన్ని పండగ చేశారు.వైయస్‌ఆర్‌ కాలంలో రైతులకు ఎంతో మేలు చేశారు.

జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు మొదలుపెట్టారు.పుష్కర ఎత్తిపోతల పథకం, చాగల్నాడు ఎత్తిపోతల పథకం,తాడిపూడి ఎత్తిపోతల పథకం వంటివి చేపట్టారు.లక్షల ఎకరాలు సాగుచేయడానికి పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చారు.వైయస్‌ఆర్‌ హయాంలో 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు.అర్హులైన వారందరికి పింఛన్ల అందించారు. పేదలకు అప్పులపాలు అవ్వకూడదని,పేదవారికి కార్పొరేట్‌ వైద్యం అందించాలని వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు.లక్షల మందికి ఆరోగ్యశ్రీని వర్తింపచేశారు. ఆరోగ్యశ్రీతో చిన్న పిల్లల గుండెలకు భరోసా కల్పించారు. 108,104 అంబులెన్స్‌లు ద్వారా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు.ఫోన్‌ చేసిన 10 నిముషాల్లో 108 కుయ్‌..కుయ్‌ మంటూ వచ్చేది.పేదవారు సైతం చదువుకోవాలి.పేదరికం చదువుకు అడ్డుకాకూడదనే ఉద్దేశ్యంతో వైయస్‌ఆర్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పెట్టారు.

లక్షల మంది విద్యార్థులు డాక్టర్లు,ఇంజనీర్లుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు.కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరను 70 రూపాయలు పెంచితే..అక్కాచెల్లెమ్మలకు భారం కాకూడదని ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది.అన్ని రకాల సంక్షేమం జరిగింది.వైయస్‌ఆర్‌ హయాంలో శాచునేషన్‌ పద్దతిలో కుల,మత,పార్టీలకు అతీతంగా అందరికి సంక్షేమం అందించారు.వైయస్‌ఆర్‌ మరణంతో వందలాది మంది గుండెలు ఆగిపోయాయి.మరణించిన వారి ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తానని వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేశారు.ఇచ్చిన మాట ప్రకారం వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేపట్టారు.రాష్ట్రం మొత్తం మా కుటుంబాన్ని ఎంతో ఆదరించింది.తెల్లవారు జామున కూడా ప్రజలు మేల్కొని తమ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.మీ రుణం ఎన్నటికి మరిచిపోలేను. వైయస్‌ జగన్‌ ఓదార్పు చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు. ఎన్నో అడ్డంకులు పెట్టింది.

వైయస్‌ మరణం అనంతరం ఆయన  వెంట ఉన్నవారు కూడా తోడుగా లేరు.ప్రజలే మా కుటుంబానికి అండగా ఉన్నారు..కాంగ్రెస్,టీడీపీలు కలిసి వైయస్‌ జగన్‌పై కుట్రలు పన్నారు.సీబీఐ,ఈడీ విచారణలు జరిపారు.ఆస్తులను అటాచ్‌ చేశారు.విచారణ పేరుతో పిలిచి వైయస్‌ జగన్‌ను జైల్లో పెట్టారు.మా కుటుంబాన్ని అన్నిరకాలుగా వేధింపులకు గురిచేశారు.వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకు సుమారు 30 సంవత్సరాలు సేవ చేశారు.కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోసిన వైయస్‌ఆర్‌ బిడ్డ వైయస్‌ జగన్‌ను 11 కేసుల్లో అన్యాయంగా ఇరిక్కించారు.వైయస్‌ఆర్‌ పాలన చూశారు.నేడు చంద్రబాబు పాలన చూశారు.వైయస్‌ఆర్‌ పాలనలో సంక్షేమం..అభివృద్ధితో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే..నేడు చంద్రబాబు పాలనలో దోపిడీ సాగుతుంది. ఏవర్గం సంతోషంగా లేరు.నేడు చంద్రబాబు హయాంలో తెలుగుదేశం నేతలు ఇసుక,మట్టి,బొగ్గు దోచుకుంటున్నారు.

రాజధాని భూములు,ఆలయ,దళిత భూములను అమ్ముకుంటున్నారు. తెలుగుదేశం పాలనంతా అవినీతిమయంగా సాగుతుంది.నలభై సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గొప్ప రాజధాని నిర్మిస్తానన్నాడు. కాని ఒక శాశ్వత భవనానికి ఇటుక కూడా పడలేదు. తాత్కాలిక భవనాలతో గ్రాఫిక్స్‌ చూపిస్తున్నాడు.వర్షం వస్తే నీరు కారుతున్నాయి.చంద్రబాబుఐదు మాఫీలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఆ ఐదు సంతకాలకు కూడా దిక్కులేదు.వైయస్‌ఆర్‌ హయాంలో ఉచిత విద్యుత్,కరెంట్‌ బకాయిలు మాఫీపై సంతకం చేస్తే ఆరోజే అమల్లోకి వచ్చాయని గుర్తుచేశారు.చంద్రబాబు ప్రభుత్వంలో ఐదు సంతకాలు పెట్టి పెట్టారు. ఒక సంతకం కూడా నెరవేరిందా అని అడుగుతున్నా..చంద్రబాబు మీ భవిష్యత్‌..మా భదత్ర అంటున్నారు. చంద్రబాబు ఎవరికి మద్దతు ఇస్తున్నాడు. మీ పిల్లలకు భద్రత ఇస్తున్నాడా, రైతులకు భద్రత ఇస్తున్నాడా,డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు భద్రత ఇస్తున్నాడా..ఎవరికి భద్రత ఇస్తున్నాడు.

రైతులను  చంద్రబాబు నిండా ముంచారు.డ్వాక్రా మహిళలను మోసం చేశారు.సాగునీరు, తాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు.నదుల్లో ఇసుకను అమ్ముకుంటున్నారు.ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతోంది.ఆరోగ్యశ్రీ,ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నీరుగార్చారు.వైయస్‌ఆర్‌సీపీ వైయస్‌ఆర్‌ ఆశయాల కోసం పుట్టిన పార్టీ.చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నాడు.చంద్రబాబు ప్రత్యేకహోదాను ఢిల్లీకి తాకట్టు పెట్టారు.నేడు ప్రత్యేకహోదా నిలబడిందంటే దానికి కారణం వైయస్‌ జగనే..చంద్రబాబు బీజేపీతో కలిసి ఉన్నప్పుడు జగన్‌ను తల్లికాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు.నేడు రాహుల్‌తో కలిసిన చంద్రబాబు..  బీజేపీ,కేసీఆర్‌తో జగన్‌ కలిశాడంటూ దుష్ఫ్రచారం చేస్తున్నాడు. వైయస్‌జగన్‌ ఎన్నాడూ బీజేపీ,కేసీఆర్,కాంగ్రెస్‌తో లేడు.కేసీఆర్‌కు,మన రాష్ట్రానికి ఏమిటి  సంబంధం అన్ని అడుగుతున్నా..కేసీఆర్,మనం కలిసి పోటి చేస్తున్నామా.. కేసీఆర్‌ను ఓడించమని ప్రజలను చంద్రబాబు ఎందుకు రెచ్చగొడుతున్నారు.

కేసీఆర్‌ ఒకటే చెప్పాడు.పార్లమెంటులో ప్రత్యేకహోదా కోసం పారాడేటప్పుడు వాళ్ల 17 మంది ఎంపీలతో కలిసి ఏపీకి నేను కూడా ప్రత్యేకహోదాపై అడుగుతాను అనిచెప్పారు.అది ఒక్కటే తప్ప..కేసీఆర్‌కు,మనకు ఎటువంటి సంబంధం లేదు.వైయస్‌ జగన్‌ ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు. 25 మంది ఎంపీలను గెలిపించుకుని ప్రత్యేకహోదా సాధించుకుందాం.రైతులకు  వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. పంట బీమా చేస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు ఇస్తాం.డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తాం. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం. ఆరోగ్యశ్రీ దావరా 1000 రూపాయలు దాటిని ప్రతి వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా చేస్తాం. దేశంలో ఎక్కడైనా వైద్యం చేయించుకునే అవకాశం ఇస్తాం.ఎంత ఖరీదైనా ఆపరేషన్‌ అయినా,వైద్యం అయినా సరే ఉచితంగా అందిస్తాం.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలనెలా ప్రత్యేకంగా పింఛను ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మన ప్రభుత్వం వచ్చాక పార్టీలు,కులాలు,మతాల,వర్గాలకు అతీతంగా పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తాం.ప్రతి ఇల్లు అక్కచెల్లెమ్మల పేరు మీదే రిజిష్టర్‌ చేయిస్తాం.ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మన ప్రభుత్వం రాగానే గ్రామ సచివాలయాల ద్వారా యువతకు గ్రామానికి 10 ఉద్యోగాలు 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటిర్‌ ద్వారా ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే అందేలా డోర్‌ డెలివరీ చేస్తాం. గ్రామ వాలంటిర్‌కు 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం. దీని కోసం తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెడతాం. ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పర్వతశ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కాకినా పార్లమెంటు అభ్యర్థిగా వంగా గీత నిలబడ్డారు. ఫ్యాన్‌ గుర్తుపై మీ ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నా.ఒకసారి వైయస్‌ఆర్‌ పాలనను గుర్తుతెచ్చుకుని ఓటు వేయాలని కోరుతున్నా.. 

Back to Top