వైయ‌స్ జగన్‌ మీ బాధలు విన్నారు.మీ కష్టాలు చూశారు

చంద్రబాబు పాలనలో ప్రజలు సంతోషంగా లేరు

వైయస్‌ఆర్‌ మరణంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది

దోపిడీదారులు పాలకులయ్యారు..

విలువలు,విశ్వసనీయతకు పట్టం కట్టండి..

జగన్‌ను సీఎం చేసుకుని రాజన్న రాజ్యం తీసుకొద్దాం

ఎచ్చెర్ల ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ విజయమ్మ

 

శ్రీకాకుళం జిల్లా:చంద్రబాబు పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరని,అవినీతి,అక్రమాలతో దోపిడీ పాలన సాగుతుందని వైయస్‌ విజయమ్మ మండిపడ్డారు.ఎచ్చెర్ల నియోజకవర్గం సి.సిగడాం ఎన్నికల ప్రచార సభలో ఆమె మాట్లాడారు.
ప్రసంగం ఆమె మాటల్లోనే..
అన్నదమ్ములు,అక్కాచెల్లెమ్మలకు పేరుపేరునా ధన్యవాదాలు. వైయస్‌ఆర్,జగన్‌ను అక్కున చేర్చుకున్న ప్రతి హృదయానికి అభినందనలు. మీరు చూపించే అప్యాయతకు మరోసారి నమస్కారాలు.ఎన్నికలు రానే వచ్చేశాయి..కేవలం వారం రోజుల మాత్రమే ఉన్నాయి. న్యాయానికి,అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది.అందరూ మోసపోకుండా విలువలు,విశ్వసనీయతకు పట్టం కట్టాలి.వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి 30 సంవత్సరాలుగా భుజ స్కందాలపై మోసి సీఎం చేసుకున్నారు.వైయస్‌ఆర్‌ ప్రజలందరిని కడుపులో పెట్టుకుని చూసుకున్నారు.ఒకసారి వైయస్‌ఆర్‌ పాలనను గుర్తుచేసుకోవాలని. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు.75 రూపాయలు పెన్షన్‌ను వైయస్‌ఆర్‌ 200 రూపాయలకు పెంచారు. ఆరోగ్యశ్రీ,108,104,ఫీజురీయింబర్స్‌మెంట్‌ తీసుకురావడం జరిగింది.

అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు.చంద్రబాబు హయాంలో అభివృద్ధి జరగలేదు.ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదు.వైయస్‌ఆర్‌ హయాంలో అన్నివర్గాలు సంతోషంగా ఉన్నారు.చంద్రబాబు హయాంలో ఏ వర్గం సంతోషంగా  లేరు.ఎలాంటి సంక్షేమం, అభివృద్ధి జరగడంలేదు.వైయస్‌ఆర్‌ మరణంతో నా వచ్చిన కష్టమే కంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది.వైయస్‌ఆర్‌ మరణం తర్వాత పరిస్థితులను చూస్తే..వైయస్‌ఆర్‌ మరణంతో ఎంతో మంది గుండెలు ఆగిపోయాయి.ఇచ్చిన మాట కోసం జగన్‌  ఓదార్పు యాత్ర చేశారు.మీరు చూపించిన ఆదరణ ఎప్పటికి మరిచిపోలేం.తెల్లవారు జామున కూడా వైయస్‌ జగన్‌ కోసం వేచిచూశారు.వైయస్‌ జగన్‌ ఓదార్పు యాత్ర చేయడం కాంగ్రెస్‌కు నచ్చలేదు.కాంగ్రెస్,టీడీపీలు కలిసి అనేక కుట్రలు పన్ని జగన్‌పై కేసులు పెట్టారు.జైలుకు పంపించారు.ఈడి,సిబిఐ విచారణలంటూ రోడ్డు మీదకు తీసుకొచ్చారు.తొమ్మిది సంవత్సరాలు జగన్‌కు వచ్చిన కష్టం ప్రజలకు చెప్పలేదు.నిరంతరం ప్రజల కోసమే తపన పడ్డారు. వైయస్‌ఆర్‌ ఇచ్చిన కుటుంబం కోసం అనేక పోరాటాలు చేశారు. ప్రతి కష్టంలో,సమస్యల్లో జగన్‌ ఉన్నారు.ప్రత్యేకహోదా,సమైక్యాంధ్ర కోసం అనేక పోరాటాలు,దీక్షలు చేశారు.ప్రజల మధ్యే నిత్యం జగన్‌ గడిపారు.పాదయాత్ర కూడా చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.వైయస్‌ కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా అంటే ప్రత్యేక అభిమానం. వైయస్‌ఆర్,షర్మిలమ్మ కూడా ఇక్కడే పాదయాత్ర ముగించారు.

మా కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేయడం చారిత్రాత్మకమన్నారు.ఈ ఎన్నికల్లో పొరపాటు చేయకుండా వైయస్‌ఆర్‌సీపీని గెలుపించుకుందాం. వైయస్‌ఆర్‌ ఆశయాల కోసం వైయస్‌ఆర్‌సీపీ పుట్టింది.జగన్‌ మాట ఇస్తే చేసి తీరుతాడు.సాధిస్తాడు.నేను ప్రజల ముందుకు వస్తే టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారు.జగన్‌తో పాటు ప్రజలపై ప్రేమ ఉండబట్టే ఈ రోజు మీ ముందుకు వచ్చాను.వైయస్‌ఆర్,జగన్‌లు కూడా ప్రజలే కుటుంబంగా భావిస్తారు. తొమ్మిది సంవత్సరాల్లో మా నాన్న నన్ను ఒంటరి చేసి పోలేదు.నాకు ప్రజలను కుటుంబంగా ఇచ్చారని జగన్‌ గర్వంగా చెబుతాడు. చంద్రబాబు ప్రేమ విలువ తెలియదు.ప్రజలందరూ నా కుటుంబం అని భావించి ముందుకు వచ్చాను.ప్రజలకు మాత్రమే మేం సమాధానం చెప్పవలసిన  అవసరం ఉంది. ప్రజలకు,మాకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఎవరూ వేరుచేయలేదు.ముగ్గురు పాదయాత్రలో కూడా ప్రజలు తోడుగా ఉన్నారు.మీ ఆశ్వీరాద బలం,ప్రార్థనలు వైయస్‌ జగన్‌ను పెద్దగండం నుంచి తప్పించాయి.వైయస్‌ఆర్‌ లాగా జగన్‌ మేలు చేస్తారని రాజశేఖర్‌రెడ్డి భార్యగా మాట ఇస్తున్నారు.వైయఆర్‌ హయాంలో శాచునేషన్‌ పద్దతిలో కులాలు,మతాలు,పార్టీలకతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమపథకాలు అందించారు.వైయస్‌ఆర్‌ పాలన కాలంలో ఒక పన్ను కూడా పెరగలేదు.కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరను 50 రూపాయలు పెంచితే అక్కాచెల్లెమ్మలపై భారం పడకూడదని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు.వైయస్‌ఆర్‌ అభివృద్ధి పథంలో నడిపించారు.

నేడు చంద్రబాబు పాలనలో మోసం,అన్యాయం,దౌర్జన్యం జరుగుతుంది. ఇసుక,మట్టి,బొగ్గు,భూములను దోచుకుంటున్నారు. ప్రజలు మేల్కోని రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులను కాపాడుకోవాలని కోరుతున్నా..వైయస్‌ఆర్‌ హయాంలో జిల్లాకు రైతుల కోసం ప్రాజెక్టులను మొదలుపెట్టారు.వంశధార,తోటపల్లి,ఆఫ్‌షోర్స్‌ ప్రాజెక్టులు, ఆసుప్రతి,అంబేద్కర్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేశారు.చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుల పనులు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.ఒక జిల్లాకే 2లక్షల 64 వేల ఇళ్లను కట్టించారు. చంద్రబాబు నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏమి చేశారని ప్రశ్నిస్తున్నా..అంబేద్కర్‌ యూనివర్శిటీని నాశనం చేశారు.స్కూళ్లను కూడా మూయించివేశారు.ఐదు ఎస్సీ హాస్టళ్లను కూడా మూయించి వేశారు.పైడి భీమవరం పా్రరిశామిక వాడలో 7 పరిశ్రమలను మూసివేశారు. కొత్త ప్రరిశమలు తీసుకురావాలని గాని  ఉన్న పరిశ్రమలను మూసివేసే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వంలో ఉంది.స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా,వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు.వైయస్‌ఆర్‌ ఆనాడు మూడు ట్రిపుల్‌ ఐటి తీసుకొచ్చారు.గ్రామీణ విద్యార్థులు చదువుకోవాలని అన్ని సౌకర్యాలు కల్పించారు.

శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటిని ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నా..చేనేతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వందల కోట్లు బకాయిలు ఉన్నాయి..వచ్చాయా బకాయిలు..చేనేతలను ఇచ్చిన ఒక హామీ కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ఈ నియోజకవర్గంలో మత్స్యకారులకు ఉపాధి లేదు. పనిలేక వలసపోయే పరిస్థితి ఉంది.వైయస్‌ఆర్‌ హయాంలో ఉపాధి కల్పించారు.ఈ నియోజకవర్గానికి చెందిన 13 మంది మత్సా్యకారులను పాకిస్తాన్‌ సైన్యం అరెస్ట్‌ చేస్తే ఐదు నెలలు అయినా ఇప్పటివరుకు విడుదల కాలేదు.చంద్రబాబు వారిని విడిపించే ప్రయత్నం కూడా చేయలేదు.ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు అని అడుగుతున్నా..వైయస్‌ఆర్‌ హయాంలో మత్స్యకారులకు సబ్సిడీ కింద వలసలు,బోట్లు, డిజీల్‌ రాయితీలు ఇచ్చేవారు.చంద్రబాబు హయాంలో టీడీపీవారికి మాత్రమే పథకాలు అందుతున్నాయి.మత్స్యకారులకు వేట విరామంల పరిహారం కూడా సరిగ్గా రావడంలేదు.మత్స్యకారులను ఎస్టీల్లోనూ చేరుస్తాన్నారు. చేర్చారా..తెలుగుదేశం మంత్రి ఉన్నారా.. ఆయన వల్లన మీకు అభివృద్ధి జరిగిందా. ఒక మంచి పని అయినా చేశాడా..ఒక హామీ అయినా నెరవేర్చారా..చంద్రబాబు హామీ ఇచ్చిన నారాయణపురం అనకట్ట,మడ్డువలస ప్రాజెక్టు ఏమయ్యాయి అని అడుగుతున్నా. వందల పడకల ఆసుప్రతి ఏమైనా వచ్చాయా..చంద్రబాబు చేసిందేమిటంటే నీరు–చెట్టు పేరుతో దోపిడీ,పరిశ్రమల పేరు చెప్పి కోట్లాది రూపాయలు భూములు దోచుకుంటున్నారు.ప్రభుత్వ భూములను తమవిగా చూపించి 30 కోట్లు కళా వెంకట్రావ్‌ మింగేశారు. ఎక్కడా చూసిన అవినీతే.వైయస్‌ జగన్‌  అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రాజెక్టు పూర్తిచేసుకుందాం..వ్యవసాయాన్ని పండగ చేసుకుందాం..

ప్రరిశమల్లో  75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం తీసుకువస్తాం.మత్స్యకారుల వేట విరామంలో 10వేలు ఇస్తారు. చనిపోయిన వారికి 10 లక్షలు బీమా  ఇచ్చి జగన్‌ ఆదుకుంటారు.చంద్రబాబు ఆరు వందలకు పై చిలుకు హామీ లిచ్చి అధికారంలోకి వచ్చి మోసం చేశాడు.ఒక కూడా నెరవేర్చలేదు.ఐదు సంతకాలు చేశాడు..ముఖ్యమంత్రి సంతకానికే గతి లేదు.వైయస్‌ఆర్‌  మొదటి సంతకం ఉచిత విద్యుత్‌పై చేశారు. కరెంటు బకాయిలను మాఫీ చేశారు.చనిపోయిన రైతు కుటుంబానికి లక్షన్నర ఇచ్చారు.చంద్రబాబు హయాంలో రైతు రుణమాఫీ జరిగిందా అని అడుగుతున్నా.వడ్డీలేని రుణాలు కూడా అందడంలేదు.మైక్రోఫైనాన్స్‌ రుణాలు తెచ్చుకుని కట్టలేక చనిపోతున్నారు.వ్యవసాయాన్ని చంద్రబాబు దండగ అన్నారు.రైతుల పట్ల అసెంబ్లీల్లో ఆనాడు చంద్రబాబు ఎగతాళిగా మాట్లాడాడు.ఎలక్షన్‌ దగ్గరకొచ్చేసరికి అన్నదాత సుఖీభవ అంటూ ముందుకు వస్తున్నాడు...డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేసాడా..అని అడుగుతున్నా. ఎన్నికలు రెండు నెలలు ఉన్నాయనగా పసుపు–కుంకుమ అంటూ  పెద్దన్న అంటూ వస్తున్నాడు.అన్న అనేవాడు అన్ని వేళలా ఆదుకోవాలి..అవసరానికి వచ్చేవాడు అన్న కాదు.2 రూపాయలకు 20 లీటర్ల నీరు ఇస్తున్నారా.. సాగునీరు,తాగు నీరు దోరకడంలేదు కాని మద్యం సంపూర్ణంగా దోరుకుతుంది. బెల్ట్‌షాపులను రద్దు చేస్తానని చెప్పాడు..రద్దు చేశారా..నిరుద్యోగులకు రెండు వేలుభృతి ఇస్తానన్నాడు..ఇస్తున్నాడా..ప్రభుత్వ ఉద్యోగాలు 2లక్షలకు పైగా ఖాళీలు ఉన్నాయి. కనీసం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయలేదన్నారు.పేదవారికి కార్పొరేట్‌ వైద్యం అందించాలని ఉద్దేశ్యంతో ఆనాడు ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన లక్షలాది మందికి ఆపరేషన్లు చేయించి ప్రాణాలు కాపాడారు.

నేడు చంద్రబాబు  హయాంలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు.ఆసుప్రతులకు కనీసం బిల్లులు కూడా చెల్లించడం లేదు.హైదరాబాద్‌లో ఆరోగ్యశ్రీ వర్తించదని చెబుతున్నాడు.ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా వైయస్‌ఆర్‌ హయాంలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకున్నారు.నేడు చంద్రబాబు హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందండంలేదు.జగన్‌ ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబు కాపీకొడుతున్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో దేశంలోనే 48 లక్షలు ఇళ్లు కట్టిస్తే మన  రాష్ట్రంలో 48 లక్షలు ఇళ్లు కట్టించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలు,కులాలు,మతాల,వర్గాలకు అతీతంగా పేదలందరికి పక్కా ఇళ్లు కట్టిస్తారు. ప్రతి ఇల్లు అక్కచెల్లెమ్మల పేరు మీదే రిజిష్టర్‌ చేయిస్తారు. ఆ ఇంటిపై పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరుకు పొదుపు సంఘాల్లో మీకు అప్పు ఎంతైతే ఉందో ఆ మొత్తం సొమ్మును 4 దఫాల్లో నేరుగా మీ చేతికి ఇస్తారు. సున్నావడ్డీకే రుణాలు ఇచ్చి బ్యాంకుల వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారీటీ అక్కలకు కార్పొరేషన్ల ద్వారా 75 వేలు దఫాలుగా వైయస్‌ఆర్‌ చేయత పథకం ద్వారా ఉచితంగా ఇస్తాం. జగన్‌ పాదయాత్రలో అమ్మఒడి నిర్ణయం తీసుకున్నారు.మీ పిల్లల్ని బడికి పంపితే చాలు మీ చేతికే సంవత్సరానికి 15 వేలు ఇస్తారు.ఇంటర్‌ వరుకూ ఉచితంగా చదివిస్తారు.

చదువుకి ఎవ్వరికి పేదరికం అడ్డు కాకుడదు..జగన్‌ అందరిని ఉన్నత చదువులు చదివిస్తాడు. నూటికి నూరుశాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తారు. .వసతి,భోజనానికి అదనంగా ఏడాదికి రూ.20వేలు ఇస్తారు. వైయస్‌ఆర్‌ భరోసా ద్వారా పంట వేసే సమయానికి మే నెలలో సంవత్సరానికి రూ.12వేలు పెటుబడి భరోసాగా మీ చేతులకే ఇస్తాం. వడ్డీలేని పంట రుణాలు ఇస్తాం. రూ.3వేల కోట్లుతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. ప్రకృతి విపత్తుల సహాయనిధికి మరో 4వేల కోట్లు ఇస్తాం.జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టులు పూర్తిచేస్తాం.ప్రత్యేకహోదా కావాలంటే 25 మంది ఎంపీలను గెలిపించుకోవాలి.వైయస్‌ జగన్‌ ఒంటరిగానే పోటి చేస్తారు.ప్రజలకు జగన్‌ అండగా ఉంటారు. 

Back to Top