వైయ‌స్‌ విజయమ్మ చేతుల మీదుగా ‘లీడర్‌ టు లీడర్‌’ డైరీ ఆవిష్కరణ

హైదరాబాద్‌: దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్యఘట్టాలతో పాటుగా, ఆయన తనయుడు ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వ విశేషాలతో నవలా రచయిత వేంపల్లి నిరంజన్‌రెడ్డి రూపొందించిన ‘లీడర్‌ టు లీడర్‌’డైరీని గురువారం హైదరాబాద్‌లో వైయ‌స్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అనంతరం నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయ‌స్సార్‌ అంటే తమకు ఎనలేని అభిమానమని, 2010లో తొలి సారిగా వెలువరించిన డైరీకి విశేష స్పందన లభించిందని, ఆ స్ఫూర్తితోనే 11 ఏళ్లుగా డైరీలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. డైరీలో మహానేత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాల తో పాటు, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర, ప్రజా సంకల్పయాత్ర, రైతు భరోసా విశేషాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించామని వెల్లడించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top