ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు

 వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ 
 
ప్రతిదినం..ప్రజాహితం పుస్తకం ఆవిష్కరణ

హైదరాబాద్‌: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 90 శాతం హామీలను ఏడాదిలోనే అమలు చేశారని  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలపై నేషనల్‌ మీడియా సలహాదారు అమర్‌ నేతృత్వంలో ప్రతిదినం..ప్రజాహితం అనే పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తకాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జులై 8న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారని తెలిపారు. 6 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారన్నారు.హరిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందన్నారు. 
 

Back to Top