బాబాజీరావుకు వైయ‌స్‌ విజయమ్మ పరామర్శ 

 కొవ్వూరు: గోపాలపురం మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాష్ట్ర మంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావును వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ హైదరాబాద్‌లోని సీటీ న్యూరో ఆసుపత్రిలో   పరామర్శించారు. బాబాజీరావు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా బాబాజీరావు యోగక్షేమాలను ఆమె అడిగి తెలుసుకుని, ఆరోగ్యం త్వరగా మెరుగుపడి కోలుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తానేటి వనిత, కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం బాబాజీరావు ఆరోగ్యం మెరుగుపడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. 
 

Back to Top