చంద్రబాబు, పవన్‌ ఇద్దరు ఒక్కటే

కాకినాడ సభలో వైయస్‌ షర్మిల

వైయస్‌ఆర్‌ హయాంలో ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు

అవినీతి, అక్రమాలకు మారు పేరు చంద్రబాబు

మహిళలను చంద్రబాబు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు

మహిళా ఎమ్మార్వోను ఎమ్మెల్యే చేయి చేసుకుంటే బాబు ఏం చేశారు? 

రిషితేశ్వరి విషయంలో చంద్రబాబు ఏం న్యాయం చేశారు?

ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అబద్ధాలు ఆడుతారా?

వైయస్‌ జగన్‌ హోదా కోసం ఎన్నో దీక్షలు, నిరసనలు చేశారు

చంద్రబాబు డైరెక్టర్‌ ..పవన్‌ యాక్టర్‌

 

 

కాకినాడ: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరు ఒక్కటేనని వైయస్‌ జగన్‌ సోదరి వైయస్‌ షర్మిల పేర్కొన్నారు. పవన్‌ రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్‌ అయితే..పవన్‌ యాక్టర్‌ అన్నారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్‌ నటిస్తారన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేసినట్లు పవన్‌ కూడా జనసేన పార్టీని టీడీపీకి హోల్‌సేల్‌గా అమ్మేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల మాట్లాడారు. 

  • ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు వైయస్‌ఆర్‌. అందుకే మహానేత చనిపోయి పదేళ్లు కావస్తున్నా కోట్ల మంది హృదయాల్లో వైయస్‌ఆర్‌ స్థిరస్థాయిగా నిలిచిపోయారు. కుల, మత, పార్టీలకు మేలు చేసిన వ్యక్తి మహానేత వైయస్‌ఆర్‌. ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు అవమానం తీసుకొచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దగా చేశారు. ఇప్పుడేమో నేను మీ అన్నను..నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే అని చెప్పుకొని తిరుగుతున్నాడు ఈ దొంగబాబు..నమ్ముతారా?
  • వనజాక్షి అనే మహిళా ఎమ్మార్వో ఇసుక మాఫియాను అడ్డుకుంటే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ జుట్టుపట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. చంద్రబాబు ఏం చేశారు. మళ్లీ అదే మనిషికి ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు అనే అన్న చనిపోయాడా?. రిషితేశ్వరి అనే విద్యార్థిని గుంటూరు యూనివర్సిటీలో టీడీపీకి చెందిన బాబురావు అనే వ్యక్తి హింసించడంతో ఆత్మహత్య చేసుకుంది. ఏం చేశారు చంద్రబాబు..ఆ పాప చనిపోయినప్పుడు ఈ బాబులోని అన్న చనిపోయాడా? .
  • మధ్యాహ్నం భోజనం తయారు చేసే మహిళల ఉద్యోగాలు తీసి ఏజెన్సీకి ఇస్తామంటే పాపం..వాళ్లందరూ ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులతో లాఠీలతో కొట్టించారు. అప్పుడు చంద్రబాబులోని అన్న చచ్చిపోయాడా?..ఇప్పుడేమో అన్నా అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా నమ్ముతారా? అక్కా మీరు నమ్ముతారా? ఇలాంటి అన్న ఉంటే అంతకంటే దురదృష్టం ఉండనే ఉండదు.
  • విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తామన్నారు. ఇస్తున్నాడా?. ఇవ్వడం లేదు. పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు అప్పులపాలువుతున్నారు. ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్‌ ఆసుపత్రుల లిస్టు నుంచి తొలగించారు. ఇప్పుడు పేదవాడికి జబ్బు చేస్తే కార్పొరేట్‌ ఆసుపత్రికి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే వెళ్లాలట. చంద్రబాబో..ఆయన కుటుంబీకులకో జబ్బు చేస్తే ఎక్కడికి వెళ్తారు. వీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారా? పేదలను మాత్రం గవర్నమెంట్‌ ఆసుపత్రికి వెళ్లాలని చంద్రబాబు శాసిస్తున్నారు.ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ..తన ప్రజల కోసం ఇలాగేనా చేసేది. 
  • పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సి ఉంది. చంద్రబాబు తన కమీషన్ల కోసం రూ.15 వేల కోట్ల ప్రాజెక్టును రూ.60 వేల కోట్లకు అంచనాలు పెంచారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం ఉంటే ఈ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయ్యేది.
  • హైదరాబాద్‌ అంతా నేనే కట్టానని, అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చుతానని గొప్పలు చెబుతున్నారు. అమరావతిని అమెరికా, శ్రీకాకుళాన్ని హైదరాబాద్‌ చేస్తామని చెప్పుకుంటున్నారు. రాజధాని కోసం చంద్రబాబు  ఇంతవరకు ఏం చేశారు. ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ అయినా కట్టారా?. రాజధాని కోసం కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చిందట. ఆ డబ్బంతా చంద్రబాబు బొజ్జలోకి వెళ్లింది. అందుకే నిన్ను నమ్మం బాబు అని చెప్పండి.
  • బాబు వస్తే జాబు వస్తుందన్నారు. జాబు ఎవరికి వచ్చింది. చంద్రబాబు కొడుకు లోకేష్‌ మాత్రమే మూడు ఉద్యోగాలు వచ్చాయి. ఏ అర్హత, అనుభవం ఉందని లోకేష్‌కు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. ఇది పుత్రవాత్సల్యం కాదా? ఈ పప్పుకు జయంతికి, వర్ధంతికి తేడా తెలియదు. ఈయన మూడు శాఖలకు మంత్రై కూర్చున్నాడు. ఒక్క ఎన్నిక కూడా ఈ పప్పుగారు గెలవలేదు.
  • ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరి లాంటిది. అలాంటి హోదాను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారు. మళ్లీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్లీ హోదా  అంటారు. రేపు ఏమంటారో ఆయనకే తెలియదు. అప్పుడు బీజేపీతో పొత్తు అన్నారు.  ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. ఈయనది రెండు నాలుకల ధోరణి. దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి. వైయస్‌ జగన్‌ ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు. ధర్నాలు, బంద్‌లు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు చేశారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. చివరకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలతో రాజీనామా చేయించారు. చంద్రబాబు ఈ రోజు యూటర్న్‌ తీసుకొని మళ్లీ హోదా కావాలంటున్నారంటే అది వైయస్‌ జగన్‌ వల్ల కాదా? చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పడు. ఎందుకంటే నాన్నగారు చెప్పేవారు. చంద్రబాబుకు ఒక శాపం ఉందట. చంద్రబాబు ఏ రోజైతే నిజం చెబుతారో ఆ రోజు ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందట. 
  • చంద్రబాబు పౌరుషం, రోషమంటూ తనకు సూటికాని మాటలు పలుకుతున్నారు. మాకు కేసీఆర్‌తో పొత్తు, బీజేపీతో పొత్తు అంటున్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి కాపురం చేసింది చంద్రబాబే. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకొని టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం వెంపర్లాడింది చంద్రబాబే. ఇప్పుడు మాకు పొత్తు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొడుకు ఒక్క ఎన్నిక గెలవలేదు. అయినా కూడా  ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు. అప్పుడు చంద్రబాబు పౌరుషం నిద్రపోయిందా? . ఎన్టీఆర్‌ నుంచి ఆయన కుర్చీని, ఆయన పార్టీని వెన్నుపోటు పొడి గుంజుకున్నారు. పిల్లి గట్టిగా అరిస్తే పులి అవుతుందా? పిల్లి పిల్లే..పులి పులే..
  • జగన్‌ మోహన్‌ రెడ్డి ఓదార్పు అనే మాట కోసం కాంగ్రెస్‌ నుంచి సింగిల్‌గానే బయటకు వచ్చారు. జగన్‌ వెంట 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వస్తే వారితో రాజీనామా చేయించి మళ్లీగెలిపించుకున్నారు. అది పౌరుషం అంటారు. బీజేపీతో పొత్తు ఉంటే తనపై ఉన్న కేసులన్నీ మాఫీ చేయించుకునేవారు కాదా? మాకు బీజేపీ, టీఆర్‌ఎస్, కాం్రVð స్‌తో పొత్తు లేదు. సింహాం సింగిల్‌గానే వస్తుంది. జగన్‌ సింగిల్‌గానే, వైయస్‌ఆర్‌సీపీ సింగిల్‌గానే బంపర్‌ మెజారిటీతో గెలుస్తుందని దేశంలోని అన్ని సర్వేలు చెబుతున్నాయి. చంద్రబాబు నక్క కాబట్టే ఎవరు తోడు వస్తే వారిని వెంట తెచ్చుకున్నారు.
  • పవన్‌ కళ్యాణ్‌ ఎవరు ? ఆయన ఒక యాక్టర్‌..రాజకీయ సినిమాలో పవన్‌ హీరో అయితే..చంద్రబాబు డైరెక్టర్‌. అందుకే పవన్‌ కల్యాన్‌ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారు. ఇద్దరూ ఒక్కటే. అందుకే కలిసి పోటీ చేస్తున్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పవన్‌కు వేసినట్లే..జనసేనకు ఓటు వేస్తే టీడీపీకి వేసినట్లే..పవన్‌ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీ పెట్టి ..అదే పార్టీకి హోల్‌సెల్‌గా అమ్మేశారు. తమ్ముడికి అన్న పోలికలు ఉంటాయి. పవన్‌ కూడా జనసేనను హోల్‌సేల్‌గా  అమ్మేస్తారు. కాకపోతే ఈయన తెలుగు దేశం పార్టీకి అమ్మేస్తారు. అంతే తేడా..అంతా సేమ్‌ టూ సేమ్‌.. 
  • ఈ నెల 11న ఎన్నికలు ఉన్నాయి. ఓటు వేసే సమయంలో ఒక్కసారి రాజన్నను తలచుకోండి. రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న సీఎం కావాలి. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద ప్రతి మే మాసంలో రూ. 12500 రూపాయలు ఇస్తారు.  గిట్టుబాటు ధరకై మూడు వేల కోట్ల రూపాయలతోతో ఒక నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేస్తారు. సున్నా వడ్డికే రుణాలు ఇస్తారు. కాలేజీ విద్యార్థులు ఏ కోర్సు అయినా చదవచ్చు. ఏ కోర్సు చదివిన ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్య శ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రిలను చేరుస్తాం. పిల్లలను బడికి పంపించడానికి తల్లిదండ్రులకు రూ. 15వేలు ఇస్తాం. అవ్వలకు తాతలకు పెన్షన్లు రూ. రెండు వేల నుంచి క్రమంగా మూడు వేలకు పెంచుతాం. వికలాంగులకు పెన్షన్లు మూడు వేలు ఇస్తాం. 45 సంవత్సరాల దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకి 75 వేల రూపాయిలు అందిస్తాం. కాకినాడ నియోజకవర్గ వైయస్ఆర్  సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి,  ఎంపీ అభ్యర్థి వంగాగీతను భారీ మెజారీటీతో గెలిపించండి.మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Back to Top