బాబును చూసి ఊసరవెల్లి సిగ్గుతో పారిపోతుంది

మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి జనం ఓ లెక్కా..

జయంతి, వర్థంతికి తేడా తెలియని లోకేష్‌ను మంత్రిని చేశారు

కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు

హోదా కోసం పదవులు వదులుకున్న ఘనత వైయస్‌ఆర్‌సీపీది

జగనన్నకు ఒక అవకాశం ఇద్దాం.. 

ప్రతి కుటుంబంలో సంతోషం నింపుతాడని మాటిస్తున్నా..

గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గ సభలో వైయస్‌ షర్మిల

గుంటూరు: పూటకో మాట.. రోజుకో వేషం మారుస్తున్న చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో తలదించుకుంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు ఓ లెక్కా అన్నారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడుతాడని, ఎన్ని కుట్రలైనా పన్నుతాడని, ఈ ఐదేళ్లు మోసపోయింది చాలు.. మళ్లీ చంద్రబాబును నమ్మి మోసపోవద్దన్నారు. గుంటూరు వెస్ట్‌లో వైయస్‌ షర్మిల రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 

 

ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి రాష్ట్ర ప్రజలు ఒక లెక్కా.. బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఎవరికి జాబు వచ్చింది. చంద్రబాబు కొడుక్కు మాత్రమే వచ్చింది. కనీసం జయంతి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తికి ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారు. అ, ఆలు కూడా రావుకానీ, అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడంట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని లోకేష్‌ను ప్రజలపై రుద్దుతున్నారు. చంద్రబాబు కొడుక్కు మూడు ఉద్యోగాలు ఇవ్వొచ్చు కానీ, నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం లేవు.. నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టుపెట్టి బీజేపీతో పొత్తుపెట్టుకొని కమీషన్‌ల కోసం హోదాను తాకట్టుపెట్టి ప్యాకేజీని తీసుకున్నాడు. హోదాను నీరుగార్చిన విషయంలో చేయని ప్రయత్నం లేదు. మన రాష్ట్రానికి హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబే. ఎన్నికల ముందు హోదా అన్నాడు.. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ అన్నాడు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయిన తరువాత ఏంటాడో ఆయనకే తెలియదు. 

చంద్రబాబుది రోజుకో మాట, రోజుకో వేషం, మొన్న ఎన్నికలకు బీజేపీతో పొత్తు అన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుతో పారిపోతుంది. చంద్రబాబు పాలన ఈ ఐదేళ్లు చూశారు. ఈ ఐదేళ్లలో ప్రత్యేక హోదా కోసం ఏం చేశారు. బీజేపీతో పొత్తుపెట్టుకొని హోదాను తాకట్టుపెట్టారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం చేయని పోరాటం లేదు, ఢిల్లీలో ధర్నా చేశారు. ఆంధ్రరాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. రాస్తారోకోలు, బందులు, ప్రతి జిల్లాలో యువభేరిలు పెట్టి యువతను జాగృతం చేశారు. ఆఖరికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తరువాత నిరసనగా ఎంపీ పదవికి రాజీనామాలు చేశారు. ఈ ఎన్నికలు మంచికి చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం. వెన్నుపోటుకు విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయం చేశారు వైయస్‌ జగన్‌. ఒక్క అవకాశం జగనన్నకు ఇవ్వకూడదా అని అడుగుతున్నా.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి గారు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మేలు చేశారు. ఒక్కసారి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఇస్తే ప్రతి వర్గానికి మేలు చేస్తాడని మాటిస్తున్నా.. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేణుగోపాల్‌రెడ్డి అన్నను, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏసురత్నం అన్నను జగనన్న నిలబెట్టారు. మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్‌ గుర్తుపై వేసి జగనన్నకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.. మీకు సేవ చేసిన వైయస్‌ఆర్‌ కూతురిగా ఇదే నా ప్రార్థన. 

 

Back to Top