రైతు రాజు అయ్యే రోజులు వస్తున్నాయి

రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం

ఆచంట నియోజకవర్గ ప్రచార సభలో వైయస్‌ షర్మిల

ప్రతి కుటుంబంలో సంతోషం నింపేలా నవరత్నాలు

నారారూప రాక్షసుడిని నమ్మి మళ్లీ మోసపోవద్దు

మభ్యపెట్టేందుకు పసుపు – కుంకుమ పేరుతో ముష్టి వేస్తున్నాడు

పశ్చిమ గోదావరి: రైతు మళ్లీ తలెత్తుకొని రాజులా బతికే రోజులు తొందరలోనే వస్తున్నాయి. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం. పాదయాత్రలో ప్రజల కష్టాలన్నీ అన్న తెలుసుకున్నారు. ప్రజల ముఖాల్లో సంతోషం నింపడానికి నవరత్నాలను ప్రవేశపెట్టారు. రాజన్న రాజ్యం మళ్లీ జగనన్నతోనే సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైయస్‌ షర్మిల అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైయస్‌ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేద కుటుంబానికి భరోసా ఉండేది. ప్రతి మహిళకు నాకు అండ ఉందనే ధైర్యం ఉండేది. విద్యార్థికి ఉద్యోగం వస్తుందనే  ధైర్యం ఉండేది. ప్రతి పేదవాడు కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లి ఉచితంగా వైద్యం చేయించుకునేందుకు ఆరోగ్యశ్రీ ఉండేది. కుయ్‌.. కుయ్‌ అని ఫోన్‌ చేసిన 20 నిమిషాలకే అంబులెన్స్‌ వచ్చేది. ప్రతి ఎకరాలకు నీరు ఇవ్వాలని శ్రమించాడు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆశపడ్డాడు. ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి చార్జీలు, ఏ పన్నులు పెంచలేదు. సంక్షేమం, అభివృద్ధిని అద్భుతంగా చేసి చూపించిన వ్యక్తి వైయస్‌ఆర్‌. నీది ఏ కులం అని అడగలేదు. ఏ మతం, అని అడగలేదు. ఆఖరికి పార్టీలు కూడా అడగలేదు. మన, పర తేడా లేకుండా మేలు చేసిన వ్యక్తి రాజన్న. అందకే మహానేత చనిపోయి పదేళ్లు కావొస్తున్నా.. ఇవాల్టికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు.

వెన్నుపోటుకు, అబద్ధాలకు, అవినీతి, అరాచకాలకు మారు పేరు చంద్రబాబు. రైతులకు, డ్వాక్రా మహిళలకు మొత్తం రుణమాఫీ చేస్తానని మొదటి సంతకం పెట్టాడు. ఐదేళ్లు చంద్రబాబు మొదటి సంతకానికి దిక్కులేదు. రైతులను చంద్రబాబు దగా చేశాడు. పసుపు – కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మహిళలందరినీ వంచన చేశాడు. అది కనీసం వడ్డీకి కూడా సరిపోదు. చంద్రబాబు డ్రామాలు చూసి మోసపోకండి. మభ్యపెట్టడానికి పసుపు – కుంకుమ పేరుతో డబ్బులు ఇస్తానని చెబుతున్నాడు. ఐదేళ్లు మహిళల కోసం ఏమీ చేయలేదు. 

విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు.. ఫీజురియంబర్స్‌మెంట్‌ చేయడం లేదు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్‌ ఆస్పత్రుల లిస్టు నుంచి తీసేశాడు. పేదవారికి మెరుగైన వైద్యం లేకుండా చేస్తున్నాడు. చంద్రబాబు కుటుంబానికి జబ్బు వస్తే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తారా..? పోలవరం మూడేళ్లలో పూర్తి చేస్తానన్నాడు.. ఇప్పటి వరకు పూర్తి చేయలేదంటే.. చంద్రబాబుకు మాట మీద నిలబడే నైజం లేదు. రాజధాని విషయంలో నాకు అనుభవం ఉంది నాకు ఓటేయండి హైదరాబాద్‌ లాంటి రాజధాని కడతానని ఒక్క శాశ్వత భవనం, ఒక్క ఫ్లైఓవర్‌ అయినా కట్టాడా..? కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చిందని చెబుతుంది. ఆ డబ్బు ఏమైనట్లు. అమ్మకు అన్నం పెట్టడు కూడా పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క శాశ్వత భవనం కట్టలేదు కానీ మరోసారి అధికారం ఇస్తే అమరావతిని అమెరికా చేస్తాడంట. శ్రీకాకుళంను హైదరాబాద్‌ చేస్తాడంట. నమ్ముతారా.. నిన్ను నమ్మం బాబు అని తేల్చిచెప్పండి.

బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. చంద్రబాబు కొడుకు లోకేష్‌కు మాత్రమే వచ్చింది. పప్పుకు కనీసం జయంతికి, వర్థంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నిక కూడా గెలవని పప్పును చంద్రబాబు మూడు శాఖలకు మంత్రిని చేశాడు. సామాన్య ప్రజలకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్రరాష్ట్రానికి ఎంతో అవసరం. హోదా లేకపోతే పరిశ్రమలు రావు. ఉద్యోగాలు రావు. హోదా ఊపిరి లాంటిది. తెలిసి కూడా చంద్రబాబు బీజేపీతో కుమ్మక్కై హోదాను తాకట్టుపెట్టాడు. చంద్రబాబు గత ఎన్నికలకు ముందు హోదా 15 ఏళ్లు అన్నాడు. తరువాత మాట మార్చాడు.. ప్యాకేజీ అన్నాడు. ఎన్నికలు వచ్చాయని హోదా కావాలంటున్నాడు. ఎన్నికలు అయిపోయాక చంద్రబాబు ఏమంటాడో.. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు అన్నాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబుది ఎప్పుడూ ఒక మాట ఉండదు. అందుకే తనది రెండు నాలుకల ధోరణి అని చూపిస్తుంటాడు. ఇన్నాళ్లూ మనకు అర్థం కాలేదు. 

ప్రత్యేకహోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక పోరాటాలు చేశారు. ఢిల్లీలో ధర్నా, మన రాష్ట్రంలో  రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశారు. బంద్‌లు, రాస్తారోకోలు, యువభేరీలు, ఆఖరికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు పదవులకు రాజీనామాలు కూడా చేశారు. ఊరూరు తిరిగి వైయస్‌ జగన్‌ హోదా కోసం పోరాడి ఉండకపోతే చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని హోదా కావాలి అనేవాడా.. 

మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు దొంగ బాబు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు లోకేష్‌ బాధ్యత ఒక్కటేనా.. ప్రజల బాధ్యత ఉండదా..? ప్రతి విషయంలో అవినీతి, ఇసుక మాఫియా నుంచి భూములు స్వాహా వరకు, ఇరిగేషన్‌ నుంచి ఇన్‌ఫ్రా స్ట్రక్టర్‌ వరకు తండ్రీ కొడుకులు కలిసి రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఇప్పుడు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పుకొని తిరుగుతున్నాడు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే నాశనం చేస్తారు. నారారూప రాక్షసులు వీళ్లు.. చంద్రబాబు బస్సు డ్రైవర్‌ అంట. ప్రత్యేక హోదా అనే బస్సును బీజేపీకి అమ్మి డబ్బులు తీసుకుంది చంద్రబాబు. రాజధాని అనే బస్సును చంద్రబాబు నడిపితే దాన్ని బోల్తాకొట్టించాడు. పోలవరం అనే బస్సును సీట్లను, టైర్లను, ఏసీలను అమ్ముకున్నాడు. చంద్రబాబు బస్సు డైవర్‌ అయితే ఆ బస్సును నేరుగా తీసుకొచ్చి మీ మీద నడిపించి మీ ప్రాణాలు కూడా తీస్తాడు. నిన్ను నమ్మం అని తెలుగుదేశం పార్టీ వారికి తేల్చి చెప్పండి. 

తెలుగుదేశం పార్టీవారు మీ ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు కదా.. మేము ఫీజు కట్టుకున్నాం కదా.. ఆ డబ్బు అంతా తీర్చమని అడగండి. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తానన్నాడు. టీడీపీ నేతలు వస్తే డబ్బులు ఇచ్చాకే ఓట్లు అడగమనండి. విద్యార్థులకు ఐప్యాడ్లు, మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తానన్నాడు. నిరుద్యోగులకు భృతి రూ. 2 వేలు ఇస్తానన్నాడు. ఐదేళ్లలో ప్రతి ఇంటికి రూ. 1.20 లక్షలు అయింది. తెలుగుదేశం పార్టీ వారు ఇంటికి వచ్చి ఓట్లు అడిగితే ముందు బాకీ సంగతి తీర్చమనండి. పక్కా ఇళ్లు మాట ఏమైందని గట్టిగా నిలదీయండి. చేనేతలు, మహిళలు, రైతుల రుణాల మాఫీ ఏమైందని అడగండి. బాబు వస్తే జాబు కాదు కరువు వచ్చింది. అందుకే నువ్వు మాకు వద్దు అని చెప్పండి. బైబై బాబు అని చెప్పండి. 

రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిదేళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలు అర్థం చేసుకున్నారు. మీకు సేవ చేయాలని ఆశపడుతున్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలి. అవినీతి పోవాలంటే జగనన్న రావాలి. వ్యవసాయం మళ్లీ పండుగ కావాలంటే జగనన్న రావాలి. మాట తప్పని, మడమ తిప్పని వ్యక్తి రావాలంటే జగనన్న రావాలి. రాబోయే రాజన్న రాజ్యంలో ప్రతి రైతు మళ్లీ తలెత్తుకొని రాజులా బతికే రోజు వస్తుంది. ప్రతి రైతుకు మే నెలలోనే రూ. 12,500లు ఇస్తారు. రైతు నష్టపోకుండా గిట్టుబాటు ధర కోసం రూ. 3 వేల కోట్లతో నిధి కూడా ఏర్పాటు, ప్రకృతి వైపరీత్యాలకు రైతులను ఆదుకునేందుకు రూ. 4 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణమంతా మాఫీ చేస్తూ నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతారు. మళ్లీ సున్నావడ్డీకే రుణాలు అందిస్తారు. విద్యార్థులు ఏ చదువు చదివినా.. ప్రభుత్వమే ఎన్ని లక్షలు ఖర్చు అయినా ఉచితంగా చదివిస్తుంది. ఆరోగ్యశ్రీలో మళ్లీ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లొచ్చు. ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయిస్తుంది. తల్లులు పిల్లలను బడికి పంపిస్తే రూ. 15 వేలు ఇస్తారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేలు ఇస్తాం. అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేలు పెంచుకుంటూ పోతాం. వికలాంగులకు రూ. 3 వేల పెన్షన్, ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు, మంచినీటి సమస్య లేకుండా చేస్తాం. రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. మీ సేవ చేసుకునే అవకాశం రాజన్న కొడుకు జగనన్నకు ఇవ్వాలని కోరుతున్నాం. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగరాజు అన్నను, ఎంపీ అభ్యర్థిగా రఘురాం అన్నను గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. 

 

Back to Top