విశాఖ ప్రమాదంపై సీఎం  వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

అమరావతి: విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీలోని చెరువూరు గ్రామంలో ఆదివారం జరిగిన ఆటో ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

తాజా ఫోటోలు

Back to Top