కడప గడప నుంచే నవరత్నాలకు శ్రీకారం

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

సంక్షేమ పథకాల అమల్లో కులాలు, మతాలు, వర్గాలు చూడం

సెప్టెంబర్‌ 1 నుంచి నేరుగా సంక్షేమ ఫలాలు మీ ఇంటికే చేరుతాయి

అక్టోబర్‌ 15 నుంచి వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అమలు 

ఈ ఏడాదే చెన్నూరు చెక్కర ఫ్యాక్టరీ తెరిపిస్తాం

కడప స్టీల్‌ ఫ్యాక్టరీకి డిసెంబర్‌ 26న శంకుస్థాపన చేస్తా

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లా నుంచే న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుడుతున్న‌ట్లు ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత, రైతు బాంధవుడు డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహానేత జయంతి(జూలై, 8)ని ‘వైయ‌స్ఆర్‌ రైతు దినోత్సవం’గా జరుపుతున్న సంగతి తెలిసిందే.భా వేదికపైకి చేరుకున్న సీఎం అక్కడ  ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  రైతు దినోత్సవం ప్రధాన కార్యక్రమాన్ని జమ్మలమడుగులో నిర్వహిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.  రైతులు, పేదలు, వృద్ధులు, విద్యార్థులకు చేయూతనిచ్చే నవరత్నాలకు కడప గడపనుంచే శ్రీకారం చుడుతున్నట్టు సీఎం వైయ‌స్ జగన్‌ చెప్పారు. వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ పథకం కింద అవ్వాతాతలకు రూ.2,250, దివ్యాంగులకు రూ.3వేలు, డయాలసిస్‌ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని రైతుల ఆకాంక్షల రైతు దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు.

ప్రతి ఏటా వైయస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్వహిస్తామన్నారు. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. సెప్టెంబర్‌ 1 నుంచి సంక్షేమ ఫలాలు మీ ఇంటికే చేరుతాయన్నారు. వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కింద అవ్వాతాతలకు రూ.2500 ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తున్నామని వివరించారు. డయాలసిస్‌ పేషంట్లకు రూ.10 వేలు మంజూరు చేస్తున్నామన్నారు. రైతులకు రుణాల కోసం ఒక్క వైయస్‌ఆర్‌జిల్లాలోనే వెయ్యి కోట్లు నెల రోజుల్లో అందించామని గర్వంగా చెప్పారు. ఇకపై పూర్తిగా సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు పగటి పూట ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నామని పేర్కొన్నారు. శనగ రైతులకు రూ.330 కోట్లు మంజూరు చేశామన్నారు. వైయస్‌ఆర్‌ జిలాకు   గతంలో కంటే రెట్టింపుగా రూ.70 కోట్లను పెన్షన్‌కింద ఇస్తున్నామని చెప్పారు. రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. రైతులకు విపత్తు కోసం రూ.2 వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రమాదవశాత్తు  లేదా రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతు కుటుంబానికి తక్షణం రూ.7 లక్షల సాయం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి రైతుకు తోడుగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతుల కోసం వైయస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. రైతులు పంట సాగుకు సన్నధం అయ్యే సమయానికి పెట్టుబడుల కోసం ప్రతి ఏటా రూ.12,500 ఇస్తామన్నారు. మనం అధికారంలోకి వచ్చే సరికి జూన్‌ మాసం పూర్తి అయ్యింది. కాబట్టి ఈ పథకాన్ని నెలల ముందుకే తీసుకువచ్చాం.

అక్టోబర్‌ 15 నాటికి ప్రతి రైతుకు రూ.12,500 ఇస్తామని గర్వంగా చెబుతున్నానని తెలిపారు. మన రాష్ట్రంలో సగం రైతు కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. అర హెక్టార్‌ లోపు ఉన్న రైతులు దాదాపుగా 50 శాతం ఉన్నారు. ఈ పథకం కోసం 70 లక్షల రైతుల కుటుంబాలకు మేలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు 16 లక్షల కౌలు రైతుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రంలో లేదు. మనం చేయబోయే విప్లవాత్మకమార్పుల్లో భూ యజమానుల హక్కులను కాపాడుతాం. కౌలు రైతుల చట్టాల్లో మార్పులు తెస్తాం. సహకార రంగం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీనిఈ ఏడాదిలోనే తెరిపిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో గోడౌన్లు, కోల్టు స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబోరేటరీ ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశాం. ప్రతి నెల రైతు సమస్యలపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. పులివెందులలో అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గోదావరి జిలాలను శ్రీశైలం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. దీనిద్వారా కృష్ణా ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కడప జిల్లాకు చెందిన స్టీల్‌ ఫ్యాక్టరీని డిసెంబర్‌ 26వ తేదీన శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు. మూడేళ్లలో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చారు. కుందు నదిపై రాజోలి, జలదరాశి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతామన్నారు.

కేసీ ఆయకట్టు రైతులకు సాగునీరు ఇచ్చేందుకు ఈ ప్రాజెక్టులను నిర్మిస్తాం. డిసెంబర్‌ 26న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానని చెప్పారు. బ్రహ్మంసాగర్‌కు నీళ్లు అందని పరిస్థితి చూస్తున్నాం. వీబీఆర్‌ నుంచి నీళ్లు అందక ఖరీఫ్‌ సాగు చేయడం లేదు. కుందు నదీ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా తెలుగు గంగ కాల్వ ద్వారా బ్రహ్మసాగర్‌కు నీరు నింపుతామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కలలు కన్న రోజులను మళ్లీ తీసుకువస్తానని మాట ఇచ్చారు. గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది 20 టీఎంసీల నీరు తగ్గకుండా నిల్వ చేస్తాం. ప్రతి రైతుకు తోడుగా ఉండేందుకు 15 గ్రామాలకు సంబంధించి మరో రూ.3 లక్షలు, కొత్తగా మూడు గ్రామాలకు రూ.10 లక్షలు ఆర్‌ అండ్‌ ప్యాకేజీ కిందఅందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఊరు బాగుండాలని కోరుకునే ప్రభుత్వం ఇది. కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు చూడకుండా అందరికి మంచి చేయాలని ముందుకు వెళ్తున్నాం. పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా...
కార్యక్రమంలో వ్యవసాయమంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాదిమంది రైతులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రామసుబ్బమ్మ అనే మహిళకు రూ.7 లక్షల చెక్కు అందించి వైయ‌స్ఆర్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ప్రారంభించారు. అప్పుల బాధ తట్టుకోలేక 2015లో రామసుబ్బమ్మ భర్త  బలవన్మరణానికి పాల్పడ్డారు.

Back to Top