ఇడుపుల‌పాయ‌లో మ‌హానేత‌కు నివాళులు

వైయ‌స్ఆర్ జిల్లా:  సుదీర్ఘ పాదయాత్ర ముగించుకున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రితం ఇడుపుల‌పాయ‌లోని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఘాట్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హానేత ఘాట్ వ‌ద్ద పూల‌మాల‌లు ఉంచి నివాళుల‌ర్పించారు. అనంత‌రం అక్క‌డ జ‌రిగిన ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో వైయ‌స్ఆర్ కుటుంబ స‌భ్యులు పాల్గొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌, మ‌హానేత కూతురు వైయ‌స్ ష‌ర్మిళ‌మ్మ‌, వైయ‌స్ జ‌గ‌న్ స‌తీమ‌ణి వైయ‌స్ భార‌త‌మ్మ‌, ఎమ్మెల్యేలు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, కొర‌ముట్ల శ్రీ‌నివాసులు, త‌దిత‌రులు ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్నారు. కాగా గురువారం  శ్రీవారిని ద‌ర్శించుకుని, శుక్ర‌వారం క‌డ‌ప అమీన్ ద‌ర్గాలో ప్రార్థ‌న‌లు చేశారు. ఇవాళ  పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబ సమేతంగా వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ త‌రువాత గండి వీరాంజ‌నేయ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. పులివెందులలో దారిపొడవునా వైయ‌స్‌ జగన్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. 

మీ అంద‌రి దీవెన‌ల కోసం వ‌చ్చాను:  వైయ‌స్ జ‌గ‌న్‌
‘పాదయాత్రకు బయలుదేరే ముందు మీ అందరి దీవెనలు కోసం వచ్చాను. మీరు చేసిన ప్రార్థనలు, చల్లని దీవెనల కారణంగానే ప్రజాసంకల్పయాత్ర విజయంతంగా పూర్తయింద‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.  మీ ఆశీస్సులు నాకు, మా కుటుంబంపై ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు.  

Back to Top