ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు

వైయస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావం సందర్భంగా వైయస్‌ జగన్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి నేడు తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను, పథకాలను సజీవంగా ఉంచేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి నేటికి తొమ్మిదేళ్లు. గత ఎనిమిదేళ్లుగా ప్రజా జీవితంలో సవాళ్లు, కష్టాలు, నష్టాలకు ఎదురొడ్డి ఈ పార్టీని భుజస్కందాల మీద మోసిన ప్రతి కుటుంబ సభ్యుడికి శుభాకాంక్షలు, వందనాలు. అంటూ వైయస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

Back to Top