అభివృద్ధి అందించే సత్తా ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌

ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి సంక్షేమానికి సహకరించండి

విజయవాడ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఉదయభాను

జగ్గయ్యపేట: నిజమైన అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందించే ఏకైక సత్తా ఉన్న నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ లోక్‌సభ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పట్టణంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి ∙ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చేది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వమేనని. ఐదేళ్ల టీడీపీ పాలనలో సంక్షేమానికి దూరమైన ప్రజలకు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో అసలైన అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. జగ్గయ్యపేటతో పాటు జిల్లాలోని అన్ని స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. చదివించడం ఒకటే కాదు. చదివిన తరువాత ఉద్యోగాలు కూడా ఇస్తాడన్నారు. ప్రజలందరూ భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైయస్‌ఆర్‌ సీపీని గెలిపించాలన్నారు. మూడు వారాల్లో అధర్మానికి, ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుందని, యుద్ధంలో అంతిమ విజయం ధర్మమే సాధిస్తుందన్నారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ అని చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలను ప్రజలందరికీ వివరించాలని కార్యకర్తలకు సూచించారు. 

 

Back to Top