తాడేపల్లి: అక్రమ కేసులో అరెస్టయిన మాజీ లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్‌ను వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. 11వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన గుంటూరు జైలుకు వెళ్లి నందిగం సురేష్‌ను కలుసుకుంటారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథేచ్ఛగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులను కొనసాగిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించి మరీ అరెస్టు చేస్తోంది. దీంట్లో భాగంగా నందిగం సురేష్‌ను కూడా అరెస్టు చేశారు. మూడేళ్ల క్రితం అప్పటి సీఎం వైయస్ జగన్‌గారిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర పదజాలంతో దూషణల నేపథ్యంలో.. ఆనాడు టీడీపీ కార్యాలయం వద్ద చోటు చేసుకున్న ఘటనల కేసులో ఉద్దేశపూర్వకంగా కొందరు వైయస్ఆర్‌సీపీ నాయకులను ఇరికించారు. వారిపై తప్పుడు కేసులు బనాయించారు. మూడేళ్ల క్రితం ఈ ఘటన జరిగినా, ఉద్దేశపూర్వకంగా కొంతమందిని సాక్షులతో స్టేట్‌మెంట్లు తీసుకుని, నందిగం సురేష్‌తో పాటు, మరికొందరు నాయకుల్ని కూటమి ప్రభుత్వం ముద్దాయిలుగా చేసింది. నేరం జరిగిన తర్వాత 60 –70 రోజులు దాటాక సాక్షిని విచారిస్తే చెల్లదు.. అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని ఉల్లంఘించి వారందరినీ నిందితుల్ని చేశారు.