క‌డ‌ప అమీన్ పీర్ ద‌ర్గాలో వైయ‌స్ జ‌గ‌న్ ప్రార్థ‌న‌లు

వైయ‌స్ఆర్ జిల్లా:  ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్య‌క్షులు,  ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కొద్దిసేప‌టి క్రితం క‌డ‌ప  అమీన్ పీర్ ద‌ర్గాకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు, ద‌ర్గా పెద్ద‌లు జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. జ‌న‌నేత ద‌ర్గాలోచాద‌ర్‌ స‌మ‌ర్పించారు.

ఇవాళ‌ ఉద‌యం తిరుప‌తి నుంచి బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్ జిల్లా కుక్క‌ల‌దొడ్డి వ‌ద్ద  ఆత్మీయ స్వాగ‌తం ల‌భించింది. ఆ త‌రువాత క‌డ‌ప న‌గ‌రంలో కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకొని, వారితో మ‌మేక‌మ‌య్యేందుకు 2017 నవంబ‌ర్ 6వ తేదీన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ సుదీర్ఘంగా పాద‌యాత్ర చేశారు. ఈ నెల 9వ తేదీన శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించుకొని అక్క‌డి నుంచి నేరుగా తిరుపతికి వెళ్లి శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఇవాళ ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. 

Back to Top