కడప అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించిన వైయస్‌ జగన్‌

దర్గాలో వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు 

చాదర్‌ సమర్పించిన జననేత

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కడపలోని అమీన్‌పీర్‌ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా జననేతకు మైనారిటీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైయస్‌ జగన్‌ చాదర్‌ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా వైయస్‌ జగన్‌ నిన్న, ఇవాళ పులివెందులలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. నిన్న సాయంత్రం పులివెందులలో ఏర్పాటు చేసిన ఇప్తార్‌ విందులో పాల్గొని ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ సాయంత్రం కడప చేరుకొని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
 

తాజా ఫోటోలు

Back to Top