ప్రజా సమస్యలపై సీఎం వైయ‌స్ జగన్ దృష్టి.. 

కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్య‌మంత్రి వీడియో కాన్ఫరెన్స్
 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ప్రజా సమస్యలపై ఈ రోజు సమీక్ష చేప‌ట్టారు. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులు, వాటిని పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలను సీఎం వైయ‌స్ జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

Back to Top