మాన‌వ‌తా మూర్తి మ‌ద‌ర్ థెరిసా

మ‌ద‌ర్ థెరిసా జ‌యంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

తాడేప‌ల్లి: పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే త‌న ఆస్తిగా భావించి వారంద‌రినీ అక్కున చేర్చుకున్న మాన‌వ‌తా మూర్తి మ‌ద‌ర్ థెరిసా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొనియాడారు. ఎంతో మంది అనాథ‌లు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే కాదు అనాథ, పేద పిల్లలకు   విద్యాబుద్ధులు చెప్పించి వారి భ‌విషత్తుకు బంగారు బాట‌లు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె. మన ప్రభుత్వ హయాంలో విజ‌య‌వాడ  న‌గ‌రంలోని నిర్మల్‌ హృదయ్ ‌భవన్‌ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వారికి సహాయ సహకారాలు అందించాం. ఆ భవనం కాంప్లెక్స్‌ను ఆరోజు నేను ప్రారంభించండం సంతోషంగా ఉంది. నేడు మ‌ద‌ర్ థెరిసాగారి జ‌యంతి సంద‌ర్భంగా మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తున్నాను అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

Back to Top