మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళులు

తాడేప‌ల్లి: భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అబుల్ క‌లా ఆజాద్ దేశానికి చేసిన సేవ‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ కొనియాడారు. కార్య‌క్ర‌మంలో పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుసినే విరూపాక్షి, రేగం మత్య్సలింగం, మత్స్యరాస విశ్వేశ్వర రాజు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, విడదల రజిని, పార్టీ నేత షేక్‌ ఆసిఫ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top