జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావుకు సీఎం ఘ‌న నివాళి

తాడేప‌ల్లి:  మాజీ మంత్రి, దివంగ‌త నేత జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు జ‌యంతి సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో జ‌క్కంపూడి రామ్మోహ‌న్‌రావు చిత్ర‌ప‌టానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా జ‌క్కంపూడి సేవ‌ల‌ను స్మ‌రించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి తనయుడు ఎమ్యెల్యే జక్కంపూడి రాజా, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top