శ్రీవారి ద‌ర్శ‌నానికి బ‌య‌లుదేరిన‌ వైయ‌స్‌ జగన్‌.. 

తిరుపతి: సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్ ఒక సామాన్య భక్తుడిలా అలిపరి మార్గంలో కాలినడకన తిరుమ‌ల చేరుకున్న జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది సేప‌టి క్రితం శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి బ‌య‌లుదేరారు.  మరికాసేపట్లో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి వైయ‌స్‌ జగన్‌ శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం పద్మావతి గెస్ట్‌హౌస్‌ నుంచి అలిపిరి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు బయలుదేరారు. పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా మెట్లమార్గం గోవింద నామస్మరణతో మార్మోగింది. అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లకు మెక్కి నడక ప్రారంభించిన జననేత.. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. సామాన్య భక్తుడిలా ముందుకుసాగారు 

Back to Top