మళ్లీ బాబుకు ఓటేస్తే అంతే సంగతి

పాయకరావుపేట సభలో వైయస్‌ జగన్‌

చంద్రబాబు మళ్లీ మోసం చేయడానికి వస్తున్నాడు

మళ్లీ బాబు వస్తే పేదింటి బిడ్డలు చదువుకోలేని పరిస్థితికి వెళ్లిపోతారు

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది

తమ బాధలు పట్టవా అన్నా అంటూ రైతన్నలు రోధిస్తున్నారు

వెబ్‌ల్యాండ్‌ పేరుతో చంద్రబాబు పన్నాగం పన్నారు

\ఇసుక ఫ్రీ అంటూ చంద్రబాబు చెవిలో పువ్వులు పెడుతున్నారు

ఈ ఐదేళ్లు చంద్రబాబు చేసిన మోసాలు గుర్తుకు తెచ్చుకోండి

పత్రికలు, టీవీలు చంద్రబాబుకు అమ్ముడుపోయాయి

చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు

20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పండి

విశాఖ: చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే అంతే సంగతని, ఆయన్ను నమ్మోద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారు. ఈసారి ఆయన వస్తే ఇక ఎవరు మిగలరని హెచ్చరించారు. 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారని, నవరత్నాలతో అందరికి మేలు చేస్తారని చెప్పాలని పిలుపునిచ్చారు.  బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా పాయకరావుపేట ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు.

– ఇదే ప్రాంతం గుండా నా పాదయాత్ర సాగింది. అప్పట్లో నాకు బాగా గుర్తుంది. ఇదే నియోజకవర్గంలో రైతన్నలు పడిన బాధలు, పడిన కష్టాలు ఇవాళ్టికి కూడా నేను మరిచిపోలేదు. తాండవ చక్కెర ఫ్యాక్టరీ గురించి తెలుసు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తొమ్మిది నెలలుగా జీతాలు అందడం లేదు. ఈ సీజన్‌కు సంబంధించి రైతులకు బకాయిలు అందడం లేదు. ఆ రోజు రైతులు ఆవేదనతో అన్న మాటలు గుర్తున్నాయి.
– చంద్రబాబు సింగపూర్, దుబాయికి వెళ్తారు. లక్షల కొద్ది పరిశ్రమలు వస్తున్నాయి. రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. 40 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఇదే రైతులకు నాన్నగారి హయాంలో టన్నుకు రూ.4 వేలు బోనస్‌ ఇచ్చారు. ఈ రోజు సకాలంలో పేవ్‌మెంట్లు అందడం లేదు. 
– ఇదే నియోజకవర్గంలోని రాజయ్యపేట వద్ద జెట్టీలు కట్టిస్తామని చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేసిన పరిస్థితి నాకు గుర్తుంది. నక్కపల్లి మండలంలో పరిశ్రమల కోసం ఆరువేల భూములు సేకరించారు. రైతులను చెట్టుకు కట్టేసి కొట్టమని చెప్పిన మాటలు గుర్తున్నాయి. చంద్రబాబు ఈ ఐదేళ్లలో మాకు ఏం చేశారని నాతో అన్నప్పుడు నేను గట్టిగా ప్రశ్నించాను. రైతులకు పరిహారం కూడా అందడం లేదు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు అడుతున్నారు.
– వరహా తాండవ నదిలో ఇసుక అన్నది ఏమాత్రం లేకుండా ఏడాపెడా దోచేస్తున్న పరిస్థితి చూశాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటూ చెవ్వుల్లో పూలు పెట్టిన విషయాన్ని ప్రజలు నా వద్దకు వచ్చి చెప్పిన మాటలు గుర్తున్నాయి. నీరు–చెట్టు కింద గ్రామాలను గ్రామాలను దోచేస్తున్నారు. తాటిచెట్టు అంత లోతు తవ్వి మట్టిని తవ్వేస్తున్నారు.
– ఇదే పాయకరావుపేటలో ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదు. పక్కనే తుని నియోజకవర్గం, పాయకరావుపేట ఆనుకుని ఉంటాయి. తాగడానికి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు లేదు. ఐదేళ్లలో వీళ్లు పట్టించుకున్నది ఏంటి అన్నది నాకు గుర్తుంది. ఐదేళ్ల చంద్రబాబు పాలన తరువాత మరో పదిహేను రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు ఐదేళ్లలో ఆయన చేసిన మోసాలు, అబద్ధాలు గుర్తుకు తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను.
– చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే ఒక్క ప్రభుత్వ స్కూల్‌ కూడా ఉండదు. ఇప్పటికే ఆరువేల స్కూళ్లు మూత వేయించారు. మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పేదవాడు తమ పిల్లలను బడికి పంపించడానికి కష్టపడాల్సి వస్తోంది. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవడానికి లక్ష ఫీజు చెల్లించాల్సి వస్తోంది. రేపు మళ్లీ చంద్రబాబు వస్తే లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.
– మళ్లీ పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఆర్టీసీ, కరెంటును వదలకుండా ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తారు. ఈ ఐదేళ్లలో కరెంటు, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. ఇంటిపన్ను, పెట్రోలు, డీజీల్‌ ధరల బాదుడే బాదుడు. పొరపాటున ఓటు వేస్తే ఇక వీరబాదుడే. చంద్రబాబుకు ఓటేస్తే పింఛన్లు తీసేస్తారు. 
– 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటన ఆయన పాలన గుర్తుకు తెచ్చుకోండి. గతంలో 44 లక్షల రేషన్‌ కార్డులు ఉంటే దాన్ని 34 లక్షలకు తగ్గించారు. ఫించన్లు కుదించారు. మళ్లీ ఎన్నికలకు ముందు మాత్రమే పింఛన్లు పెంచారు. ఎన్నికలు అయిపోతేనే మళ్లీ కథ రివర్స్‌ అవుతుంది.
– చంద్రబాబుకు పొరపాటున ఓట్లు వేస్తే మీ బూములు, మీ ఇల్లు ఎప్పుడు కావాల్సిస్తే అప్పుడు లాక్కుంటారు. ఇప్పుడే పేదలకు ఇచ్చిన భూములు తన అత్తగారి సొత్తు అన్నట్లుగా గుంజుకుంటున్నారు. వెబ్‌ల్యాండ్‌ పేరుతో చంద్రబాబు ఏ రకంగా భూ రికార్డులు తారుమారు చేశారో చూశాం. 
– పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే..రేపు పొద్దున ఇసుక, మట్టి, కొండలు, నదులు, గుట్టలు ఏవీ మిగలవు. మళ్లీ ఓటు వేస్తే ఇప్పటికే లారీ ఇసుక రూ.40 వేలు ఉంది. రేపు లక్ష దాటుతుంది. ఈ సారి ఏ సినిమా చూడాలో. ఏ పత్రిక చూడాలో జన్మబూమి కమిటీలు నిర్ధారిస్తాయి. పింఛన్లు, రేషన్‌ కార్డులు కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిందే.
– చంద్రబాబు గత చరిత్రను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 1994 ఎన్నికలకు ముందుకు మద్యపాన నిషేదం, కిలో రూ.2 బియ్యం అంటూ గెలిచారు. ఎన్నికలు అయిపోయిన తరువాత 1995వ సంవత్సరం చంద్రబాబు సీఎం కాగానే బియ్యం రేటు రూ.5లకు పెంచారు. మద్యపాన నిషేదం ఎత్తివేస్తూ చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. ఇదే పెద్ద మనిషి ఇవాళ డ్వాక్రా సంఘాలకు వడ్డీలకు పెంచేస్తారు. సున్నా వడ్డీ రుణాలు ఉండనే ఉండవు. రైతులకు బ్యాంకు రుణాలను కత్తిరిస్తారు. సున్నా వడ్డీలను ఎగురగొట్టేస్తారు. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు చేసిన వాగ్ధానాలు, పెట్టిన పథకాలు అన్నీ కూడా నీరుగార్చుతారు. 
1994లో చేసిన గత చరిత్రను మరిచిపోవద్దు.
– చంద్రబాబుకు ఓటు వేస్తే..రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు. ఆరోగ్యశ్రీ ఇప్పటికే పడకేసింది. 108 అంబులెన్స్‌ ఇప్పటికే ఎప్పుడు వస్తాయో తెలియదు. రేపు చంద్రబాబు వస్తే 108, 104 ఉండదు. కాలేజీ ఫీజులు విఫరీతంగా పెంచేశారు. ఏడాదికి రూ.30 వేలు కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. చంద్రబాబుకు ఓటు వేస్తే ఫీజులు ఆకాశానికి అంటుతాయి. ఇప్పటికే ఊరికి పది ఇల్లు కూడా ఇవ్వడం లేదు. దానికి కూడా లంచాలు తీసుకుంటున్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పేదవాడికి ఇల్లు అన్నది మర్చిపోవాల్సిందే.
– చంద్రబాబుకు ఓటు వేస్తే..తనను వ్యతిరేకించే వారిని ఎవరిని కూడా బతకనియ్యడు. తానే పోలీసులను పెట్టుకున్నాడు కాబట్టి మనుషులను చంపినా కేసులు ఉండవ్‌. సీబీఐని రానివ్వడు. ఇప్పటికే మీడియా ఆయనకు అమ్ముడబోయింది. తానే చంపేయగలుగుతాడు. మళ్లీ వారి బంధువులే చంపేశారని ప్రచారం కూడా చేస్తారు. ఈయనకు ఓటు వేస్తే పరిపాలన అన్నది కూడా ఉండదు. ఈ స్థాయిలో వ్యవస్థను దిగజార్చుతారు.
– చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలు నమ్మితే..టీవీ ప్రకటనలు నమ్మితే నరమాంసం తినే వ్యక్తి వాగ్ధానాలు నమ్మినట్లే . మీ అందరిని నేను కొరుతున్నాను. ఒక్కసారి మోసపోయాం. మళ్లీ మళ్లీ అదే మోసాలు, అదే అబద్ధాలు చెబుతున్నారు. ఈ సారి మోసపోతే మనం ఎవరం కూడా మిగలం. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు రావాలి, విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి.
– రాబోయే రోజుల్లో  ఇదే పెద్ద మనిషి ఎన్నికల్లో గెలవడం కోసం చెప్పని అబద్ధం, దుర్మార్గం ఉండదు. ఆయన చేస్తున్న అన్యాయాల్లో ఒక అడుగు ముందుకు వేసి ప్రతి గ్రామానికి మూటలు మూటలుగా డబ్బులు పంపిస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బులు పెడతారు. మీరంతా కూడా మీ వార్డుల్లోకి వెళ్లాలి. ప్రతి ఒక్కరిని కలవండి. చం్దరబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని చెప్పండి.
– రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికి చెప్పండి. మన పిల్లలను ఇవాళ ఉన్నత చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా అని ఆ అక్కను అడగండి. ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం అరకొరగా  ఇస్తుంది. మన పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. 20 రోజులు ఓపిక పడితే అన్న ముఖ్యమంత్రి అవుతారు. మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగాను ఎన్ని లక్షలు ఖర్చైనా అన్నే భరిస్తారని చెప్పండి. 
– పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కను, చెల్లెమ్మను కలవండి. అక్క ఐదేళ్లు చంద్రబాబును చూశాను. రుణాలు మాఫీ చేస్తామని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. ఈ పెద్ద మనిషి సీఎం అయ్యాక సున్నా వడ్డీ రుణాలు ఎగురగొట్టారు. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న సీఎం అయ్యాక పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఎంతైతే అప్పు ఉందే అడబ్బంతా నేరుగా నాలుగు దఫాల్లో మీ చేతికే ఇస్తారని చెప్పండి. అన్న సీఎం అయ్యాక మళ్లీ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తారు. సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తారని చెప్పండి.
– ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీ అక్కలకు చెప్పండి. 45 ఏళ్లు వయసులో పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం..ఆ తరువాత వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని అన్న తెస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో రూ.75 వేలు ఉచితంగా ఇస్తారని చెప్పండి.
– ప్రతి రైతు వద్దకు వెళ్లండి. చంద్రబాబు ఇచ్చే రూ.20 వేలకు మోసపోవద్దు. చంద్రబాబు ఎన్నికలకు ముందు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశాడు. ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పండి. 20 రోజులు ఓపిక పడితే అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. ఆ తరువాత రైతులకు పెట్టుబడి కోసం మే మాసంలోనే ప్రతి ఏటా రూ.12500  ఇస్తారు. ఏకంగా రూ.50 వేలు మన చేతికే ఇస్తారని చెప్పండి. ఏ బ్యాంకు కూడా ఈడబ్బు కత్తరించడు అని చెప్పండి.గిట్టుబాటు ధరలకు అన్న గ్యారెంటీ ఇస్తారని చెప్పండి
– ప్రతి అవ్వ, తాత వద్దకు వెళ్లి చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఎన్నికలకు ముందు రెండు నెలల కిందట పింఛన్‌ ఎంతిచ్చేవారు అని అడగండి. ఇవ్వలేదని కానీ, లేదా రూ.1000 ఇచ్చేవారు అని చెబుతారు. జగనన్న రూ.2 వేలు ఇస్తామని చెప్పకపోతే చంద్రబాబు ఇచ్చేవారా? ప్రతి ఒక్కరికి చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టండి. ఆ తరువాత మీ మనువడు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తరువాత పింఛన్‌ రూ.3 వేల వరకు పెంచుతూ పోతారని చెప్పండి. నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని చెప్పండి.
– చంద్రబాబు పాలనలో ఉద్యోగాలు రాలేదు. అన్నకు  ఒక్క అవకాశం ఇద్దాం. అన్న సీఎం అయ్యాక ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయాలు తెరుస్తారు. అదే గ్రామాల్లో పది మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి.
– ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తారని చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి ఒక్కరికి తెలియాలి. నవరత్నాలతో జీవితాలు బాగుపడుతాయి. ఆ నవరత్నాల్లో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తానని గట్టిగా చెబుతున్నాను. ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు కోరుతూ పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబురావు నిలబడ్డారు. ఎంపీగా సత్యవతమ్మ ఉన్నారు. వీరిద్దరిని మీరందరూ ఆశీర్వదించాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. మన గుర్తు ఫ్యాన్‌.. అందరికి చెప్పండి అంటూ విజ్ఞప్తి చేశారు.

 

Back to Top