చంద్ర‌బాబు మోసాల‌పై ప్ర‌చారం చేయాలి

నెల్లూరు స‌మ‌ర శంఖారావం స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్‌

అన్నదాత సుఖీభవ అంటూ మరో సినిమా

ఎన్నికలొచ్చేసరికి మన పథకాలన్నింటినీ చంద్రబాబు కాపీ కొడుతున్నారు

నెల్లూరు:  చంద్రబాబు చేస్తున్న మోసాలు, తీస్తున్న సినిమాల గురించి ప్రతి గ్రామంలో ప్రచారం చేయాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బూత్ క‌మిటీ స‌భ్యుల‌కు పిలుపునిచ్చారు. చంద్రబాబు మూడు సినిమాల గురించి చెప్పండి. అందులో మొట్టమొదటి సినిమా 2014 ఎన్నికలు. అందులోని మొదటి డైలాగ్‌ వ్యవసాయ రుణాల మాఫీ. రైతుల ఖర్చుల మీద 50 శాతం లాభం వేసి కనీసం మద్దతు ధర పెంచుతామని మరో డైలాగ్‌. డ్వాక్రా రుణాలు, పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని ఇంకో డైలాగ్‌. సినిమా అంతటితో ఆగిపోలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, జాబు రావాలంటే బాబు రావాలి అన్న మరో డైలాగు. జాబు ఇవ్వకపోతే ప్రతి నెలా నిరుద్యోగ భృతి కింద రూ.2 వేలు ఇస్తానన్నాడు. 

ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌లేదు 
ఎన్నికలు దగ్గరకొస్తుండడంతో చంద్రబాబు రెండో సినిమా మొదలుపెట్టాడు. ఎన్నికల ముందు మూడు నెలలు ఆయన తీసిన రెండో సినిమా. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు. అయినా ఎన్నికల ముందు ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానంటున్నాడు. గత ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. గద్దెనెక్కాక మాట మార్చేశాడు. బాబు నిర్వాకం వల్ల డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు రూ.14,000 కోట్ల నుంచి ఏకంగా రూ.25,000 కోట్లకు చేరాయి. ఇప్పుడు పసుపు–కుంకుమ అంటూ మరో డ్రామా ఆడుతున్నాడు. ఎన్నికలకు మూడు నెలల ముందు డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నాడు. పెట్టుబడి నిధి కింద ప్రతి రైతుకు రూ.50 వేలు ఇస్తామని మనం చెప్పాం. గత ఐదేళ్లుగా రైతులకు ఇవ్వాల్సింది చంద్రబాబు ఏదీ ఇవ్వలేదు. కానీ, ఎన్నికలు వస్తుండడంతో ఆరో బడ్జెట్‌ ప్రవేశపెట్టాడు. తనకు అధికారం లేని బడ్జెట్‌. రూ.5 వేల కోట్లతో రైతు సుఖీభవ అంటూ చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. నాలుగో విడత, ఐదో విడత కింద చంద్రబాబు ఇచ్చిన చెక్కులను బ్యాంకర్లు పక్కన పడేస్తున్నారు.  

మ‌న ప‌థ‌కాల‌న్నీ కాపీ
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ఏం చేస్తుంద‌ని చెప్పేందుకు గుంటూరులో నిర్వ‌హించిన ప్లీన‌రీలో న‌వ‌ర‌త్నాలు ప్ర‌క‌టించామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ పేర్కొన్నారు. ఇందులో రైతులందరికీ ప్రతి సంవత్సరం రూ. 12,500 ఇస్తాం. ప్రతి రైతు కుటుంబానికి తోడుగా ఉంటామని మనం చెబితే.. చంద్రబాబు ఐదేళ్ల పాటు రైతులకు ఏం చేయడు. రైతులను మోసం చేసి కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా రుణమాఫీ పథకంలో నాలుగో విడత చెక్కులు ఇవాల్టికి బౌన్స్‌లు. ఆ చెక్కులు ఎవరిచ్చారని బ్యాంకుల వారు అడుగుతున్నారు. ఎన్నికలకు మూడు నెలల ముందు అన్నదాత సుఖీభవ అని ఆయన బడ్జెట్‌ కాదు. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. త‌న‌ది కానీ బ‌డ్జెట్‌లో అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కానికి నిధులు కేటాయిస్తున్న‌ట్లు డ్రామాలాడుతున్నారు.  మన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్‌ పెంచుతామని మనం చెబితే.. రెండేళ్ల క్రితం మనం చెబితే ఐదేళ్లు అవ్వా, తాతలను పట్టించుకోడు. కనీసం జగన్‌ చెప్పాడని కూడా పట్టించుకోడు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా పెన్షన్లు పెంచుతున్నట్లుగా సినిమా చూపిస్తున్నాడు. ట్రాక్టర్స్‌కు రోడ్డు ట్యాక్స్‌ లేకుండా చేస్తామని, ఆటోలు, ట్యాక్సీలకు సంవత్సరానికి రూ. 10 వేలు ఇస్తామని చెబితే. ఎన్నికలకు మూడు నెలల ముందు ట్రాక్టర్స్‌కు రోడ్డు ట్రాక్స్‌ రద్దు. అంతటితో ఆగకుండా ఆటో డ్రైవర్స్‌ కాకిచొక్కా బలవంతంగా ఇప్పేసుకొని ఈయన వేసుకొని బిల్డప్‌ ఇస్తున్నాడు. ప్రతి కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటామని మనం చెబితే. ఐదేళ్లు చంద్రబాబు పట్టించుకోలేదు. ఎన్నికలకు మూడు నెలల ముందు బీసీ డిక్లరేషన్‌ అంటాడు. గతంలో చేసిన డిక్లరేషన్‌ కథ దేవుడెరుగు. బీసీలకు 119 హామీలిచ్చాడు. హామీలు, డిక్లరేషన్‌ కథ దేవుడెరుగు, ఐదేళ్ల పాలనలో ఏమీ చేయలేదు. మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా రాజమండ్రికి వెళ్లి మరోసారి డిక్లరేషన్‌ అంటాడు. ప్రతి కులానికి కార్పొరేషన్‌ అంటాడు. ఆ కార్పొరేషన్‌కు నిధులు తన బడ్జెట్‌లోవి కాదు. ఆరవ బడ్జెట్‌లోని నిధులు కేటాయిస్తాననంటాడు. చంద్రబాబు చూపిస్తున్న సినిమా చూడండి. ఎన్నికలకు ఆరు నెలల ముందు అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నాలు చేశారు. నాలుగున్నర సంవత్సరం పట్టించుకోలేదు. వీఆర్‌ఏలు, ఆశ వర్కర్లు, హోంగార్డులు జీతాలు పెంచాలని ధర్నాలు చేశారు. 

తాజా వీడియోలు

Back to Top