వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే హోదా సాధ్యం

రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేసిన వైయస్‌ అవినాష్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా వైయస్‌ అవినాష్‌రెడ్డి రెండు సెంట్ల నామినేసన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి హరికిరణ్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. నామినేషన్‌ దాఖలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఐదేళ్లుగా వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని, ప్రత్యేక హోదా ఇచ్చేవారికే మద్దతు తెలుపుతామని వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను వైయస్‌ఆర్‌ సీపీకి ఇవ్వాలని ప్రజలను కోరారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకొని అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన ఐదేళ్లలో కడప పార్లమెంట్‌ నియోజకవర్గానికి చేయగలిగిన ప్రతి మేలు చేశానని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top