ఇది ఏమైనా బ‌డ్జెటా బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 

కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టింది

8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారు

బడ్జెట్‌ పెడితే మోసాలు బయటపడతాయని సాగదీశారు. 

బడ్జెట్‌ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్‌ అని తేల్చాయి. 

బడ్జెట్‌ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్‌ క్రైమ్‌  తెలుస్తుంది 

ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం

మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు మాత్ర‌మే

అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి?. ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?

సూపర్‌ సిక్స్‌ ఎగ్గొట్టేందుకు అన్నీ అబద్ధాలే చెప్పారు. 

రెండేళ్లు కోవిడ్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు కన్నా మెరుగైన పాలన అందించాం.

 మా హయాంలోనే అంబానీ, అదానీ రాష్ట్రానికి వచ్చారు.  

స్టీల్‌ప్లాంట్‌ పెట్టనివ్వకుండా జిందాల్‌ను బెదిరిస్తున్నారు 

కూటమి నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు. 

మద్యం దుకాణాలను ప్రైవేట్‌ సిండికేట్లకు అప్పగించేశారు

గవర్నమెంట్‌కు రావాల్సిన ఆదాయం ప్రైవేట్‌ జేబుల్లోకి వెళ్తోంది

ఇసుక రేట్లు మా ప్రభుత్వం హయాం కన్నా రెట్టింపు 

చంద్ర‌బాబు ..నీవు చేసింది మోసం కాదా?

నీవు చెప్పింది అబ‌ద్ధం కాదా?  

నీవు చేసింది ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ కాదా?

నీ మీద 420 కేసు ఎందుకు పెట్ట‌కూడ‌ద‌ని నేను ట్వీట్ చేస్తున్నాను. 

నాతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ట్వీట్ చేస్తారు

ప్ర‌జ‌లంతా చంద్ర‌బాబును ప్ర‌శ్నించాలి :  వైయ‌స్ జ‌గ‌న్ పిలుపు 

కూట‌మి స‌ర్కార్ బ‌డ్జెట్‌పై వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో వైయ‌స్ జ‌గ‌న్ మీడియా స‌మావేశం

  తాడేప‌ల్లి: కూటమి సర్కార్‌ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్‌ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు , మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు.  బడ్జెట్‌ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్‌ అని తేల్చాయి. బడ్జెట్‌ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్‌ క్రైమ్‌  తెలుస్తుంద‌న్నారు. ఇది ఏమైనా బ‌డ్జెటా అంటూ వైయ‌స్ జ‌గ‌న్ చంద్ర‌బాబును నిల‌దీశారు.  ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించారు. సూపర్‌ సిక్స్ హమీలను ఎగ్గొట్టేందుకు బాబు దుష్ప్రచారం చేశారు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే.. మా హయాంలో 15 శాతం అప్పులు పెరిగాయి. ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందో చెప్పాలి. అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి?. ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?. అప్పుల పెంపు వార్షిక సగటు చంద్రబాబు హయాంలో కన్నా మా హయాంలో తక్కువ అని వైయ‌స్‌ జగన్‌ వివరించారు. బ‌డ్జెట్‌పై వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ కేంద్ర కార్యాల‌యంలో బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.
   

వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

  ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌తో 8 నెలలు:
– దురదృష్టవశాత్తూ 8 నెలలు అయిపోయాక, ఇంకో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లూ ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌తోనే కాలం వెళ్లదీశారు.
– ఇంత కాలం ఎందుకు సాగదీశారంటే, బడ్జెట్‌ ప్రవేశపెడితే, చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు బయటపడతాయి.
ప్రజలు తమ హామీలు అడుగుతారన్న భయం. అందుకే బడ్జెట్‌ ప్రవేశపెట్టకుండా సాగదీస్తూ వచ్చారు.

చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌:
– ఇవాళ బడ్జెట్‌లో చెప్పిన అంశాలు, గణాంకాలు చూస్తే, చంద్రబాబుగారు ఎంత డ్రామా ఆర్టిస్ట్‌ అన్నది స్పష్టమైంది.
ఆయన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎలా చేశాడనేది అందరికీ అర్ధమవుతుంది. ఆయన ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌.
– ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ ఎలా ఉంటుంది అంటే.. ముందుగా తన అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయిస్తాడు. ఆ తర్వాత ఆయన దాన్నే పదే పదే మాట్లాడతాడు. 
– పనిలో పనిగా తన దత్తపుత్రుడితోనూ, తనకు సంబంధించి ఇతర పార్టీల ఉన్న వారితోనూ మాట్లాడిస్తారు. ట్వీట్స్‌ పెడతారు. చివరకు దాన్ని ఒక ఇంటర్నేషనల్‌ మ్యాటర్‌గా చేస్తారు.
ఇది ఎందుకు చెబుతున్నానంటే.. సాక్ష్యాధారాలతో సహా చూపిస్తాను.

అప్పులపై విష ప్రచారం:
– ఏ ప్రభుత్వం అయినా అప్పులు చేయడం సహజం. అది బడ్జెట్‌లో భాగమే. ప్రతి ప్రభుత్వానికి ఎఫ్‌ఆర్‌బీఎం ఉంటుంది. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేస్తారు. జీఎస్‌డీపీలో 3 శాతం లేదా 3.5 శాతం అప్పులు చేస్తారు. అంతకు మించి ఎవరికి సాధ్యం కాదు.
కానీ వారు ఒక ప్లాన్‌ ప్రకారం వారు ఎలా దుష్ప్రచారం చేశారంటే..
తొలుత..
– 05.04.2022. చంద్రబాబు ప్రకటన. రాష్ట్రం శ్రీలంక అవుతుంది.
– 13.04.2022. రాష్ట్రాన్ని శ్రీలంకగా ప్రకటిస్తారేమో.. అనడం.. దాన్ని వెంటనే ఈనాడులో రాస్తారు.
– 19.04.2022న ఈనాడులో రాశారు.. మేలుకోకపోతే మనకు శ్రీలంక గతే అని రాశారు.
– 17.05.2022న దత్తపుత్రుడు ట్వీట్‌ చేశాడు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో.. అని
– 21.07.2022న అప్పటి టీడీపీ మంత్రి, ఇప్పటి ఆర్థిక మంత్రి ఏమన్నారంటే.. శ్రీలంక కంటే రాష్ట్ర అప్పులు నాలుగు రెట్లు అని.
– 07.02.2023న అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు.. ‘అప్పు రత్న’ అని పేరు పెట్టాలని దత్తపుత్రుడి ట్వీట్‌.
– 25.10.2023. ఆ తర్వాత చంద్రబాబుగారి వదినమ్మ, బీజేపీలో టీడీపీ నాయకురాలు.. ‘రాష్ట్ర రుణం రూ.11 లక్షలు అని ప్రకటన’. 

– అంటే ఒక పద్ధతి ప్రకారం గోబెల్స్‌ ప్రచారం. కొత్త పాత్రధారులు.
వారి ఎల్లో మీడియా. ఇతర పార్టీల్లో ఉన్న టీడీపీ నాయకులు. 
– అవన్నీ ఎందుకు అంటే.. వైయస్సార్‌సీపీ ప్రభుత్వానికి అప్పులు రాకూడదు. కేంద్రం సహకరించొద్దు. ఇక్కడ ఏమేమో జరుగుతోందన్న భయం క్రియేట్‌ చేయాలి.

ఎన్నికలు సమీపించడంతో..:
– ఎన్నికలు దగ్గర పడే సరికి.. ఆ ప్రచారం మరింత ముమ్మరం చేశారు.
– 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబుగారి వదినమ్మ ప్రకటన.
– 21.04.2024న సరిగ్గా ఎన్నికలకు కొన్నాళ్ల ముందు.. ఈనాడు  ఒకాయనను పట్టుకొచ్చి.. ఆయనకు ఎకనమిస్ట్‌ అనే బిళ్ల తగిలించి.. ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు.
– అలా ఒక పద్ధతి ప్రకారం అబద్దాల ప్రచారం. విష ప్రచారం. రాష్ట్ర రుణాన్ని ఏకంగా రూ.14 లక్షల కోట్లు అని చెప్పించి, ఈనాడులో రాయడం. దాన్ని అందరూ చెప్పడం.

అధికారంలోకి వచ్చాక కూడా..:
– అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన దుష్ప్రచారం మానలేదు. ఎందుకంటే హామీలు అమలు చేయడం ఆయనకు అలవాటు లేదు. అందుకే అదే విష ప్రచారం.
– 10.07.2024న ఆర్థిక శాఖపై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్‌. దాన్ని ఈనాడులో రాస్తారు. ఈటీవీలో చూపుతారు.
– 22.07.2024న రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్‌గారి ప్రసంగం. çఆ ప్రసంగంలో కూడా అబద్ధాలు చెప్పించారు. రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లు అని చెప్పించారు. 
– 26.07.2024న చంద్రబాబు అదే ఓట్‌ ఆన్‌ ఎక్కౌంట్‌ ప్రవేశపెడుతూ అన్న మాటలు ఒకసారి విందామా?..
అంటూ ఆ వీడియో ప్రదర్శించి చూపారు.

– బాధగా ఉందంటాడు. ఆవేదనగా ఉందంటాడు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందంటాడు. భయం వేస్తుందంటాడు.
దాన వీర శూర కర్ణలో ఎన్టీఆర్‌ యాక్షన్‌ను మించి చంద్రబాబు నటన.

అప్పులపై బడ్జెట్‌లో ఏం చెప్పారు?:
– 2024–25 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర అప్పులు చూపారు. ఆ వివరాలు చూద్దాం.
– 2018–19 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2,57,509 కోట్లు. దానికి తోడు ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు చేసిన అప్పు మరో రూ.55,000 కోట్లు. ఆ రెండూ కలిపి చూస్తే.. మొత్తం అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. 
– అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ప్రభుత్వ అప్పులు చూస్తే.. ప్రభుత్వ అప్పులు రూ.4,91,734 కోట్లు. అలాగే ప్రభుత్వం పూచీ పడ్డ అప్పులు 1.54 లక్షల కోట్లు. రెండూ కలిపితే మొత్తం అప్పులు రూ.6,46,000 కోట్లు.
మరి వారు ప్రచారం చేసినట్లు ఎక్కడ రూ.14 లక్షల కోట్లు. ఎక్కడ వాస్తవ రూ.6.46 లక్షల కోట్లు.

– ఎవరి హయాంలో ఎంతెంత అప్పులు చేశారు? వాటి గ్రోత్‌ ఎంత (సీఏజీఆర్‌) అని చూస్తే..
– చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,32,079 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.3,13,018 కోట్లు. అంటే ఏటా సగటున 19.54 శాతం చొప్పున అప్పులు పెరిగాయి.
– అదే మా ప్రభుత్వ హయాంలో చూస్తే.. మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర అప్పులు రూ.3,13,018 కోట్ల నుంచి రూ.6,46,531 కోట్లకు పెరిగాయి. అంటే ఏటా సగటున 15.61 శాతం చొప్పున అప్పులు పెరిగాయి. అంటే చంద్రబాబుగారి హయాంలో కన్నా, 4 శాతం తక్కువ అన్నమాట.
– ఇక పబ్లిక్‌ సెక్టార్లకు సంబంధించి, నాన్‌ గ్యారెంటీడ్‌ అప్పులు చూసినా, చంద్రబాబుగారి హయాంలో రూ.8638 కోట్లు ఉన్న నాన్‌ గ్యారెంటీ అప్పు, ఆయన హయాం ముగిసే నాటిసి ఏకంగా రూ.77,228 కోట్లకు తీసుకుపోయాడు. 54.98 శాతం పెరిగింది. పవర్‌ సెక్టర్‌లో డిస్కమ్‌లకు అలా రుణాలు సేకరించారు.
– అదే మా ప్రభుత్వం వచ్చాక, ప్రభుత్వ రంగ సంస్థల నాన్‌ గ్యారెంటీ రుణాలు తగ్గించే ప్రయత్నం చేశాం. మా హయాంలో ఆ రుణం పెరగకపోగా, తగ్గించాం. –0.48 శాతం. అంటే ఆ రుణాన్ని రూ.75,386 కోట్లకు తగ్గించాం.

– ఇక ప్రభుత్వ అప్పు, గ్యారెంటీ అప్పు, నాన్‌ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి చూస్తే..
చంద్రబాబు హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన నాటికి రూ.1.40 లక్షల కోట్లు, ఆయన దిగిపోయే నాటికి రూ.3.90 లక్షల కోట్లు. అంటే సీఏజీఆర్‌ 23.6 శాతం అన్నమాట.
– మా హయాంలో 2019లో ఉన్న అప్పు రూ.3.90 లక్షల కోట్లు కాస్తా, రూ.7.21 లక్షల కోట్లు అయింది. అంటే సీఏజీఆర్‌ 13.57 శాతం మాత్రమే. 

– ఇంకా చెప్పుకోవాలంటే.. మా హయాంలో సీఏజీఆర్‌ 15.61 శాతం నమోదైంది.. అది కూడా రెండేళ్లు కోవిడ్‌ దుర్భర పరిస్థితులు.
– నిజానికి కోవిడ్‌ వల్ల దేశమే కాదు, ప్రపంచలోనే చాలా దేశాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వ ఆదాయం తగ్గింది. మరోవైపు ఖర్చు పెరిగింది. అయినా చంద్రబాబు కంటే మా పనితీరు చాలా బాగుంది.

చంద్రబాబు వదిలిపెట్టిన బకాయిలు:
– చంద్రబాబు దిగిపోతూ, డిస్కమ్‌ల బకాయిలు రూ.21,541 కోట్లు. అంటే కరెంటు సప్లై చేసిన వారికి డబ్బులు ఇవ్వలేదు. వాటితో పాటు, చంద్రబాబు పోతూ పోతూ మాకు ఇచ్చిన బకాయిలు ఏకంగా రూ.42,183 కోట్లు.
– ఉపాధి హామీ బకాయిలు రూ.2340 కోట్లు. ఉద్యోగుల రెండు డీఏలు బకాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.680 కోట్లు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2800 కోట్లు. రైతులకు ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు. పిల్లలకు మధ్యాహ్న భోజనం వండిన ఆయాలకు గౌరవ వేతనాలు కూడా బకాయిలు. చివరకు పిల్లల కోడిగుడ్లకు కూడా డబ్బులు చెల్లించలేదు.
– ఏ ప్రభుత్వమైనా కొంత బకాయిలు పెడుతుంది. కానీ, చంద్రబాబు మాదిరిగా ఈ స్థాయిలో బకాయిలు పెట్టిపోదు.

జీడీపీలో రాష్ట్ర వాటా. గణాంకాలు:
– ప్రభుత్వం సంపద లెక్కలు తేలాలంటే.. దేశ జీడీపీలో ప్రభుత్వ వాటా (జీఎస్‌డీపీ) ఎంత అని చూస్తే చాలు.
– చంద్రబాబుగారి హయాంలో కోవిడ్‌ మహమ్మారి లేదు. అదే మా హయాంలో రెండేళ్లు కోవిడ్‌ ఉంది.
– చంద్రబాబుగారి హయాంలో 5 ఏళ్లలో దేశ జీడీపీలో రాష్ట్ర జీఎస్‌డీపీ వాటా 4.47 శాతం. అదే మా హయాంలో అది 4.83 శాతం. అంటే కోవిడ్‌ ఉన్నా, చంద్రబాబుగారి కంటే బాగా పని చేశాం.

ఉత్పాదక రంగం చూస్తే..:
– తనకు తాను ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు చంద్రబాబు. ఆయన హయాంలో 2014–19 మధ్య దేశ వస్తు ఉత్పత్తి (ఉత్పాదక రంగం)లో రాష్ట్ర వాటా 2.86 శాతం.
– అదే మా ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌ ఉన్నా, 2019–24 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 4.07 శాతం. ఇది చాలదా? మా హయాంలో ఉత్పాదక రంగం ఎంత వేగంగా అభివృద్ధి చెందింది? చంద్రబాబు హయాంలో ఎలా నత్తనడకన సాగింది?

వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలోనే పెట్టుబడులకు బాట:
– ఆదిత్య మిట్టల్‌తో నా భేటీ. అంటూ దావోస్‌ సమావేశం ఫోటోలు చూపారు. అలాగే అదానీ, కుమార మంగళం బిర్లా, ముఖేష్‌ అంబానీతో వేర్వేరు సందర్భాల్లో ఫోటోలు చూపారు.
– ముఖేష్‌ అంబానీ మా ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ పెట్టుబడులు మొదలుపెట్టారు. ఆ మేరకు ప్రకటనలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 24న, ఎనిమిది ఎథనాల్‌ ప్రాజెక్టులు కట్టడం మొదలు పెట్టారు. 
– ఆయన దాన్ని ముందుకు తీసుకుపోతూ.. ఇక్కడ రూ.65 వేల కోట్ల పెట్టుబడి అంటూ బిల్డప్‌ ఇచ్చారు. కానీ, నిజానికి దానికి పునాది పడింది మా హయాంలోనే. ఇది వాస్తవం.

– ఏ దానికైనా బిల్డప్‌. ఆదిత్య మిట్టల్‌ ఒడిషాలో రూ.1.04 లక్షల కోట్లతో స్టీల్‌ ప్లాంట్‌ కడుతున్నారు. అయితే అదే మిట్టల్‌ ఇక్కడ అనకాపల్లి వద్ద రూ.1.61 లక్షల కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసున్నారని లోకేష ప్రకటించారు. దాన్ని ఒడిషా సీఎం తీవ్రంగా ఖండించారు.
– పైగా, వస్తున్న కంపెనీలను పంపించేస్తున్నారు. సజ్జన్‌ జిందాల్‌ ఇక్కడ స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం మొదలుపెడుతుంటే.. ఎవరో హ్యాబిచ్యువల్‌ అఫెండర్‌ను తీసుకొచ్చి, ఆరోపణలు చేయించి, ఆయన వెళ్లిపోయేలా చేశారు.

డిస్కమ్‌ల నష్టాలు. అప్పులు. గణాంకాలు:
– 2014లో చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పవర్‌ డిస్కమ్‌ల నష్టాలు రూ.6625 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి డిస్కమ్‌ల నష్టాలు ఏకంగా రూ.28,715 కోట్లకు పెరిగాయి.
– అంటే చంద్రబాబు హయాంలో ఏకంగా రూ.22 వేల కోట్ల నష్టాలు పెరిగాయి. అదే మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల నష్టాలు కేవలం రూ.395 కోట్లు మాత్రమే అదనంగా పెరిగాయి. 

– చంద్రన్న వెలుగులు. జిలుగులు. మెరుగులు అంటారు కదా.. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి 2014లో డిస్కమ్‌ల అప్పులు రూ.29,552 కోట్లు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు ఏకంగా రూ.86,215 కోట్లకు పెరిగాయి. 
– అంటే ఆయన హయాంలో డిస్కమ్‌ల అప్పులు ఏకంగా రూ.56,664 పెరిగాయి. అంటే ఏటా సగటున పెరిగిన అప్పు 23.88 శాతం కాగా, మా ప్రభుత్వ హయాంలో డిస్కమ్‌ల అప్పులు రూ.86 వేల కోట్ల నుంచి రూ.1.22 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే కేవలం రూ.36 వేల కోట్లు మాత్రమే పెరిగాయి. అంటే ఏటా పెరిగిన సగటు అప్పులు కేవలం 7.28 శాతం మాత్రమే.

చంద్రబాబు హయాంలో డిస్కమ్‌లకు అరకొర:
– మామూలుగా డిస్కమ్‌లకు ప్రభుత్వాలు సపోర్ట్‌ చేస్తాయి. అప్పుడే డిస్కమ్‌లు కొనసాగుతాయి. ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారం తగ్గుతుంది.
– చంద్రబాబుగారి హయాంలో 2014–19 మధ్య డిస్కమ్‌లను సపోర్ట్‌ చేస్తూ ఇచ్చిన మొత్తం కేవలం రూ.13,255 కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం ఏకంగా రూ.47,800 కోట్లు.
– అలా ఇవ్వగలిగాం కాబట్టే.. డిస్కమ్‌లు నిలబడగలిగాయి. 
– చంద్రబాబు మామీద వదిలిపెట్టిన ట్రూఅప్‌ ఛార్జీలు, ఫ్యుయల్‌ అడ్జస్ట్‌మెంట్‌ ఛార్జీలకు సంబంధించి, ప్రజలకు తక్కువ బదిలీ చేయగలిగాం. అంటే ఛార్జీలు పెద్దగా పెంచలేదు.

ఆరు నెలలు తిరక్కుండానే విద్యుత్‌ ఛార్జీల మోత:
– అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కూడా రాకముందే ప్రజలపై ఏకంగా రూ.17,899 కోట్ల భారం మోపాడు. ఇందులో రూ.6,072 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలు ఇప్పటికే నవంబరులో భారం మోపారు. మిగిలిన రూ.11 వేల కోట్లు డిసెంబరు నుంచి వేస్తాడు.
– చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, డిస్కమ్‌లకు సపోర్ట్‌ చేస్తే, ప్రజలపై ఈ భారం పడదు కదా?. అంటే ఆయన అక్కడ వాటికి సపోర్టు చేయకుండా, ఇక్కడ ప్రజలపై భారం వేస్తున్నాడు. అదీ చంద్రబాబు వైఖరి.

ప్రభుత్వ ఆదాయం తగ్గింది:
– ఈ ఆరు నెలల్లో చంద్రబాబుగారి హయాంలో రాష్ట్ర సంపద (స్టేట్‌ ఓన్‌ రెవెన్యూస్‌–ఎస్‌ఓఆర్‌)ను, మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలలతో పోల్చి చూస్తే, ఇప్పుడు అది –2 శాతం తగ్గింది.
– అంటే మా ప్రభుత్వ హయాంలో తొలి ఆరు నెలల్లో ఎస్‌ఓఆర్‌ రూ.42436 కోట్లు కాగా, ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఈ తొలి ఆరు నెలల్లో అది రూ.41,570 కోట్లు.
– అంటే రాష్ట్ర ఆదాయం పెరగాల్సింది పోయి తగ్గింది. ఎందుకంటే రావడం రావడం దోపిడినే. వచ్చీరాగానే యథేచ్ఛగా ఇసుక దోపిడి చేశారు. ఎక్కడా వదిలిపెట్టలేదు. 
– ఇంకా పేకాట క్లబ్‌లు. దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేష్‌కు వాటాలు.
– మద్యం షాప్‌లు. గతంలో ప్రభుత్వ «ఆధ్వర్యంలో నడిస్తే ఇప్పుడు సిండికేట్ల చేతిలో. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అది ప్రభుత్వానికి రాదు. అందరికీ వాటా. ప్రైవేటు జేబుల్లోకి.
– మా హయాంలో ఇసుక ధర రెట్టింపు. మా హయాంలో ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల రాయల్టీ వచ్చేది. టన్నుకు రూ.370 చొప్పున. – ఇప్పుడు గతంలో కంటే ఇసుక ధరలు రెట్టింపు అయ్యాయి. కానీ ప్రభుత్వానికి మాత్రం ఆదాయం పెరగలేదు. 

క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌:
– చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య క్యాపిటల్‌ ఎక్స్‌పెండీచర్‌ కింద ఏటా చేసిన సగటు వ్యయం రూ.13,860 కోట్లు కాగా, అదే మా హయాంలో చేసిన సగటు వ్యయం రూ.15,632 కోట్లు.
– అందుకే స్కూళ్లు, ఆస్పత్రులు బాగు పడ్డాయి. ప్రతి గ్రామంలో సచివాలయాలు వచ్చాయి. ప్రణాళిక ప్రకారం ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేశాం. అవి నీళ్లతో నిండాయి.
– కానీ, ఈరోజు పరిస్థితి ఏమిటి. వెలిగొండ ప్రాజెక్టు పూరై్తనా నీళ్లు నింపని పరిస్థితి.

ఇప్పుడు జగన్‌ ఉండి ఉంటే..:
– ఈ పాటికి జగన్‌ ఉండి ఉంటే.. ప్రజలకు ఇవన్నీ వచ్చి ఉండేవి.
ఏప్రిల్‌లో వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు.
మే లో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ.
జూన్‌లో బడులు తెరవగానే జగనన్న అమ్మ ఒడి.
జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపునేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపు.
ఆగస్టులో విద్యాదీవెనలో మరో త్రైమాసిక చెల్లింపు. వాహనమిత్ర.
సెప్టెంబరులో వైయస్సార్‌ చేయూత.
అక్టోబరులో వైయస్సార్‌ రైతు భరోసా రెండో విడత.
నవంబరులో జగనన్న విద్యాదీవెన. రైతులకు వైయస్సార్‌ సున్నా వడ్డీ రుణాలు.. బాబు రాకతో అవన్నీ క్లోజ్‌.
– డిసెంబరులో చూస్తే.. ఈబీసీ నేస్తం. లా నేస్తం. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపులు.
జనవరిలో వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ ఆసరా, జగనన్న తోడు, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక.
ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు.
మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు.
పద్ధతి ప్రకారం క్యాలెండర్‌ ఇచ్చి, అన్నీ పక్కాగా అమలు చేశాం. 
– వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్ల నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇచ్చాం.

మరి చంద్రబాబు ఈ బడ్జెట్‌లో చూపారా?:
– ఇదే చంద్రబాబు సూపర్‌సిక్స్‌లో ఏమన్నాడు? యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. అంటే రూ.7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్‌ లో కనిపించిందా? 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు:
– అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్‌ 2 గాంధీ జయంతికి ముందే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేశాం. 
– 2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించి, ప్రభుత్వ పథకాలు డోర్‌ డెలివరీ చేశాం. అదే కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీస్‌లో అక్షరాలా 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.
– లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌ లో లక్షా 2 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపుగా 80,400 కోట్ల ఇన్వెస్ట్‌ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఎంఎస్‌ఎంఈలు 2019–24 మధ్య గ్రౌండ్‌ అయినవి 3.94 లక్షలు అయ్యాయి. ఒట్టి ఎంఎస్‌ఎంఈల ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. 
– గవర్నమెంట్‌ రంగంలో ఇచ్చిన 6.31 లక్షల ఉద్యోగాలకు తోడు, లార్జ్‌ అండ్‌ మెగా ఇండస్ట్రీస్‌ లో ఇచ్చిన 1.02 లక్షల ఉద్యోగాలకు తోడు ఎంఎస్‌ఎంఈలలో ఇచ్చి 23 లక్షల ఉద్యోగాలు.. ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వగలిగాం. 

బాబు వచ్చారు. ఉద్యోగాలు పోయాయి:
– మరి చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుపై పడేశారు. ఉద్యోగాలు కట్‌. 15 వేల మంది ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లో పని చేస్తున్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. 
– 104, 108 ఎంప్లాయీస్‌ కు 2 నెలల జీతం రాకపోతే గొడవ చేస్తే మొన్న ఇచ్చారు. ఆపరేటర్‌ కు అయితే అది కూడా ఇవ్వలేదు. 
– ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్లు ఫిర్యాదులు. టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని కంప్లయింట్స్‌. ఇవన్నీ ఆరు నెలల చంద్రబాబు పాలనలో చూస్తున్న విచిత్రాలు. 

ప్రభుత్వం ఫెయిల్‌:
– మహిళలు, చిన్నారుల పరిస్థితి చూస్తే ఎప్పుడూ చూడని విధంగా జరుగుతోంది. ఏకంగా 110 మంది మహిళలు, చిన్నారుల మీద అత్యాచారాలు ఈ ఐదున్నర నెలల్లోనే జరిగాయి. ఇందులో 11 మంది చనిపోయారు. 
– ఇంత మందిపై దాడులు జరుగుతున్నా, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. బడ్జెట్‌ చూస్తే మోసం, అబద్ధం. అన్ని రకాలుగా ప్రభుత్వం ఫెయిల్‌.
– పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వలేదు. వారు రోడ్డెక్కుతున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.2300 కోట్లు దాటాయి. వారు రోడ్డెక్కుతున్నారు. 108, 104 సిబ్బంది ధర్నా చేస్తున్నారు.

డైవర్షన్‌ పాలిటిక్స్‌. అక్రమ కేసులు:
– అతలాకుతలం అవుతున పరిస్థితుల్లో నీ సూపర్‌సిక్స్‌ ఒక మోసం. సూపర్‌ సెవెన్‌ ఒక మోసం. నీ బడ్జెట్‌ ప్రజెంటేషన్‌ ఒక మోసం. రోజూ డైవర్షన్‌ టాపిక్స్‌. 
– వీటన్నింటినీ ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మంది సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులు. 147 మంది మీద కేసులు. 49 మందిని అరెస్టు చూపారు.

ఇది ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌కాదా?:
అందరం ట్వీట్‌ చేయబోతున్నాం:
– చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. ఇదిగో నీ మోసం. నీ సూపర్‌ సిక్స్‌. దీనికి కావాల్సిన బడ్జెట్‌ రూ.74 వేల కోట్లు. కానీ కేటాయింపు లేదు. 
– నీవు చేసింది మోసం కాదా? నువ్వు చెప్పేది అబద్ధం కాదా? నీ మీద 420 కేసు పెట్టకూడదా? ఇది ఆర్డనైజ్డ్‌ క్రైమ్‌ కాదా?.. అని నేను ట్వీట్‌ చేస్తున్నాను. నా ఎమ్మెల్యే అభ్యర్థులు, మా పార్టీ నాయకులంతా ట్వీట్‌ చేయబోతున్నారు.
– నీపై 420 కింద కేసు ఎందుకు పెట్టకూడదు?. నీవు చేసింది మోసం కాదా?.
– వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నా. ఈ రెండూ పెడుతూ ట్వీట్‌ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్‌ చేయండి. ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌.. అన్నింట్లో పెట్టండి.
–  ఎంత మందిని అరెస్టు చేస్తారో చూద్దాం. అరెస్టు చేయడం మొదలు పెడితే, నాతోనే స్టార్ట్‌ చేయమని చెబుతాను.

Back to Top