పాలవలస రాజశేఖరం మృతికి వైయస్‌ జగన్ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం మృతి ప‌ట్ల‌ మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఆయ‌న మృతికి సంతాపం తెలుపుతూ..కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు.
 
ఉనుకూరు శాసనసభ్యుడిగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాపరిషత్ ఛైర్మన్ గా, డీసీసీబీ ఛైర్మన్ గా పలు కీలక పదవుల్లో పనిచేసిన పాలవలస రాజశేఖరం శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ ప్రస్తుతం శాసనమండలి సభ్యుడి గా కొనసాగుతుండగా... ఆయన కుమార్తె మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి 2024లో పాతపట్నం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ తరపున పోటీ చేశారు.

Back to Top