కలుషిత ఆహారం తిని విద్యార్థులు మృతి.. వైయస్ జగన్ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని ప్ర‌భుత్వాన్ని వైయస్ జగన్‌ డిమాండ్‌ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురదజల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మానుకొని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పున‌రావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు

Back to Top