ఫార్మా కంపెనీలో ప్రమాదంపై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి

తాడేప‌ల్లి: అనకాపల్లి జిల్లా పరవాడలో ఠాగూర్‌ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై, ఒక కార్మికుడు చనిపోగా, 8 మంది అస్వస్థతకు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై వైయ‌స్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంతో పాటు, ఘటనలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Back to Top