చంద్ర‌బాబు పాల‌న‌లో కుట్ర‌లు, కుతంత్రాలు

చింత‌ల‌పూడి స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

ఒకే ప్రాజెక్టుకు సంబంధించి మూడు మండ‌లాలు ఉంటే ఒక్కో మండ‌లంలో ఒక్కో రేటు ఇచ్చాడు

పామాయిల్ ధ‌ర మ‌న ద‌గ్గ‌ర ఒక రేటు, ప‌క్క‌న తెలంగాణ బార్డ‌ర్‌లో మ‌రో రేటు 

 ప్ర‌త్యేక హోదాను తాక‌ట్టుపెట్టి ఏకంగా వెన్నుపోటు పొడిచిన వ్య‌క్తి చంద్ర‌బాబు

మ‌న యుద్ధం చంద్ర‌బాబు ఒక్క‌రితోనే కాదు.. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5

మార్పు తీసుకువ‌చ్చే దిశ‌గా మీ అంద‌రి చ‌ల్ల‌ని ఆశీస్సులు కోరుతున్నా..

ప‌శ్చిమ‌గోదావ‌రి: చ‌ంద్ర‌బాబు పాల‌న‌లో కుట్ర‌లు, కుతంత్రాలు క‌నిపిస్తాయ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ ఐదేళ్ల పాల‌న‌లో మోసాలు, అబ‌ద్ధాలు, అన్యాయం, అక్ర‌మాలు కనిపిస్తాయ‌ని చెప్పారు. మ‌రో 20 రోజులు ఓపిక ప‌డితే రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని, అన్న ముఖ్య‌మంత్రి అవుతార‌ని అంద‌రికీ చెప్పాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ సూచించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం చింత‌ల‌పూడిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..

 3648 కిలోమీట‌ర్లు న‌డ‌వ‌గ‌లిగానంటే అది దేవుడి ద‌య‌, మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో జ‌రిగింద‌ని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. నా పాద‌యాత్ర‌లో మీరు చెప్పిన క‌ష్టాల‌ను విన్నాను. ఆ రోజు మీరు చెప్పిన బాధ‌ల‌ను విన్నాను. రాష్ట్రంలో ప్ర‌తి అడుగులో ప్ర‌తి కుటుంబం ఏమ‌నుకుంటుందో విన్నాను. రాష్ట్రంలో సాయం కోసం ఎదురుచూస్తూ ప్ర‌భుత్వం స్పందించ‌క సాయం అంద‌క ఇబ్బందులు ప‌డిన ప్ర‌తి కుటుంబం ప‌డిన బాధ‌లు చూశాను. ఆ ఆవేద‌న‌ను నేను విన్నాను.. మీ అంద‌రికీ చెబుతున్నాను.. నేను విన్నాను.. మీ అంద‌రికీ నేను ఉన్నాను. గిట్టుబాటు ధ‌ర‌లు అంద‌క‌, ఈ ఐదు సంవ‌త్స‌రాల్లో ఏ మాత్రం రైత‌న్న‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేక రైతులు ప‌డిన బాధ‌లు చూశాను. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు ప‌డిన బాధ‌లు విన్నాను. పూర్తి ఫీజురియంబ‌ర్స్‌మెంట్ రాక‌, చ‌దువులు కొన‌సాగించ‌లేక‌, కాలేజీల్లో ఫీజులు చూస్తే ఇంజ‌నీరింగ్ చ‌ద‌వాలంటే ల‌క్ష రూపాయ‌లు దాటిన ప‌రిస్థితులు చూసి ప్ర‌భుత్వం త‌రుఫునుంచి సాయం అంద‌క‌, ఆ చ‌దువులు కొన‌సాగించాలంటే త‌ల్లిదండ్రులు అప్పుల‌పాల‌వుతున్న ప‌రిస్థితులు చూసి ఆ పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటుంటే.. ఆ త‌ల్లిదండ్రులు వ‌చ్చిన బాధ‌లు చెప్పారు. ఆ క‌ష్టాలు చూశా. ఆ బాధ‌లు నేను విన్నా.. 108కి ఫోన్ కొడితే కుయ్‌.. కుయ్ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ వ‌స్తుందో రాదో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ప‌డిన ప‌రిస్థితులు చూశా. ఆరోగ్య‌శ్రీ అమ‌లుకాక‌, వైద్యం అంద‌క చివ‌ర‌కు ప‌క్ష‌పాతం వ‌చ్చినా మంచానికే ప‌రిమిత‌మైన ప‌రిస్థితుల్లో ఉండి.. వీల్ చైర్‌లో వ‌చ్చి ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌న్నా.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నా.. మందుల‌కే ఇంత ఖ‌ర్చు అవుతుంద‌న్నా అని చెప్పిన బాధ‌లు విన్నాను.. 

మ‌ద్యానికి బానిస‌లై, గ్రామాల్లో ఎక్క‌డ చూసినా మ‌ద్యం షాపులు క‌నిపిస్తున్న ప‌రిస్థితుల మ‌ద్య కుటుంబాలు చిన్నాబిన్న‌మైన ప‌రిస్థితులు చూశాను. రాత్రి 7 దాటితే ఇంట్లో నుంచి ఆడ‌పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపించాలంటే త‌ల్లిదండ్రులు జంకే ప‌రిస్థితులు చూశా. ఆ త‌ల్లిదండ్రులు బాధ‌లు విన్నాను. ఉద్యోగాలు రాక చ‌దువులు అయిపోయి డిగ్రీలు చేతిలో ప‌ట్టుకొని రాష్ట్రం విడిపోయిన‌ప్పుడు 1.40 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని క‌మ‌ల‌నాథ‌న్ క‌మిటీ తేల్చింది. ఆ ఉద్యోగాలు రిలీజ్ చేస్తే సిద్ధంగా ఉండాల‌ని వేల‌కు వేలు త‌గ‌లేస్తూ కోచింగ్ సెంట‌ర్‌కు వెళ్లిన పిల్ల‌ల ఆవేద‌న‌ను విన్నాను. డిగ్రీలు చేత‌పుచ్చుకొని ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల‌కు, దేశాల‌కు వ‌ల‌స వెళ్తున్న పిల్ల‌ల బాధ‌లు విన్నాను.
 
ప్ర‌త్యేక హోదా వ‌స్తుంది. త‌ద్వారా ఇన్‌కం ట్యాక్స్‌, జీఎస్టీ క‌ట్టాల్సిన ప‌నిలేదు. హోట‌ళ్లు, ఆస్ప‌త్రులు, ప‌రిశ్ర‌మ‌లు వ‌స్తాయి. ఉద్యోగాలు మ‌న‌కు వ‌స్తాయ‌ని ఆశ‌గా ఎదురుచూసిన పిల్ల‌ల‌ను చూశాను. ప్ర‌త్యేక హోదా అనేది ఇవ్వ‌కుండా, హోదాను తాక‌ట్టుపెట్టి ఏకంగా వెన్నుపోటు పొడిచిన ప‌రిస్థితుల మ‌ధ్య ఆ పిల్ల‌ల బాధ‌లు విన్నాను. నీటి కోసం అల్లాడుతున్న గ్రామాల‌ను చూశాను. పిల్ల‌ల‌ను చ‌దివించుకోవ‌డం కోసం అక్క చెల్లెమ్మ‌లు ప‌నుల‌కు పోయే ప‌రిస్థితులు నా క‌ళ్లారా చూశాను. ఇదే చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ప‌రిస్థితులు రైత‌న్న‌లు చెప్పిన బాధ‌లు నా క‌ళ్ల‌తో చూశాను. విన్నాను. ఇదే చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గంలో మెట్ట ప్రాంతాల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఇదే ప్రాజెక్టు రైత‌న్న‌లు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి దివంగ‌త నేత నాన్న‌గారు బ‌తికి ఉంటే ఆ ప్రాజెక్టు పూర్త‌య్యేద‌ని ఆ రైత‌న్న‌లు చెప్పిన బాధ‌లు నాకు ఇంకా గుర్తున్నాయి. ఐదేళ్లు చంద్ర‌బాబు పాల‌న చేశాడు. ప్రాజెక్టు పూర్తి చేయాల్సింది పోయి.. ఆ ప్రాజెక్టుకు ఎలా అడ్డుగోడ‌లు క‌ట్టాలని దిక్కుమాలిన ఆలోచ‌న‌లు చేశాడు. ఒకే ప్రాజెక్టుకు సంబంధించి మూడు మండ‌లాలు ఉంటే ఒక్కో మండ‌లంలో ఒక్కో రేటు ఇచ్చాడు. ఒక మండ‌లంలో రూ. 22 ల‌క్ష‌లు, మ‌రో మండ‌లంలో రూ. 19 ల‌క్ష‌లు, ఇంకో మండ‌లంలో రూ. 12.5 ల‌క్ష‌లు మాత్ర‌మే ఇచ్చాడు. చివ‌ర‌కు రూ. 12.50 ల‌క్ష‌లు తీసుకున్న రైత‌న్న‌లు కోర్టుకు వెళ్లిన ప‌రిస్థితి తీసుకొచ్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. ప్రాజెక్టు క‌ట్ట‌కూడ‌ద‌ని చేస్తున్న కుట్ర‌ల‌ని రైత‌న్న మాట‌లు నేను విన్నాను. 

ఇదే చింత‌ల‌పూడి రైతాంగం పామాయిల్ ఎక్కువ‌గా పండిస్తారు. పామాయిల్ ధ‌ర మ‌న ద‌గ్గ‌ర‌కు ఒక రేటు, ప‌క్క‌న తెలంగాణ బార్డ‌ర్‌లో వెయ్యి రూపాయ‌లు మ‌న‌కంటే ఎక్కువ రేటు ఉంది. ఇంత‌కంటే అన్యాయం ఎక్కువ‌గా ఉంటాయా అన్నా అని రైత‌న్న ప‌డిన బాధ‌లు నేను విన్నాను. ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికైనా ప్ర‌మాదం జ‌రిగినా, పెద్ద రోగం వ‌స్తే 60 కిలోమీట‌ర్ల దూరం ఉన్న ఏలూరుకు వెళ్లాల్సిన దుస్థితి. 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి కోసం ఎదురుచూస్తున్న పేద‌వాడు ప‌డుతున్న బాధ‌లు చూశాను. అయినా చంద్ర‌బాబు పాల‌న‌లో క‌నీసం ప‌ట్టించుకునే నాధుడు క‌రువైన ప‌రిస్థితులు చూశాను. ఇదే చింత‌ల‌పూడిలోనే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయ‌ని, చింత‌ల‌పూడి నుంచి నామ‌వ‌రం వ‌ర‌కు ప‌శువులు కూడా పోలేక‌పోతున్నాయ‌ని, రోడ్లు వేయ‌మ‌ని ఐదు సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వాన్ని కోరుతున్నా.. క‌నీసం ప‌ట్టించుకునే పాపాన పోలేద‌ని, ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి చంద్ర‌బాబు వ‌చ్చి కొబ్బ‌రికాయ కొట్టాడు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌న్నా అని ఇక్క‌డి ప్ర‌జ‌లు అంటుంటే ఈ బాధ‌లు నేను విన్నాను. నాయ‌క‌పోడు కులానికి సంబంధించిన వాళ్లు ఎస్సీలుగా ఉండి కూడా స‌ర్టిఫికెట్లు అంద‌డం లేద‌ని బాధ‌లు ప‌డుతుంటే ఆ బాధ‌లు నేను విన్నాను. మీరు చెప్పిన ప్ర‌తి క‌ష్టం చూశాను. మీ ఆవేద‌న‌ను నేను అర్థం చేసుకున్నాను.. మీ అంద‌రికీ నేను ఉన్నాన‌ని మాటిస్తున్నాను. 

చంద్ర‌బాబు పాల‌న‌లో ఎక్క‌డ చూసినా కుట్ర‌లు, కుతంత్రాలు క‌నిపిస్తాయి. పేద‌వాడికి, రైత‌న్న‌కు, అక్క‌చెల్లెమ్మ‌ల‌కు, నిరుద్యోగుల‌కు, చ‌దువుకునే పిల్ల‌ల‌కు, చివ‌ర‌కు అవ్వాతాత‌ల‌ను మోసం చేయ‌గ‌లిగిన వ్య‌క్తి చంద్ర‌బాబు. మోసాలు మీరే చేస్తున్నారు. కుట్ర‌లు మీరే చూస్తున్నారు. చంద్ర‌బాబు చేస్తున్న డ్రామాల‌ను కూడా మీరే చూస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ప‌రిపాల‌న చేయ‌మ‌ని ఓటేసి గ‌డువు ఇస్తే.. 60 నెల‌ల్లో 57 నెల‌లు మ‌న క‌డుపు మాడ్చి చివ‌రి మూడు నెల‌లు మీకు బిర్యానీ పెడ‌తాడ‌న‌ని సినిమా చూపిస్తున్నాడు. ఒక్క‌సారి ఆలోచ‌న చేయ‌మ‌ని అడుగుతున్నా.. ఈ మోసాన్ని చూడ‌మ‌ని,  ఈ కుట్ర‌లు, ఈ అబ‌ద్ధాలు చూడ‌మ‌ని అడుగుతున్నా.. ఇవే కుట్ర‌లు రాబోయే రోజుల్లో ఇంకా తీవ్ర‌మ‌వుతాయి. ఈ కుట్ర‌ల్లో భాగంగా అబ‌ద్ధాలు, మోసాలు ఎక్కువ అవుతాయి. ఉన్న‌ది లేన్న‌ట్లుగా.. లేనిది ఉన్న‌ట్లుగా చెబుతారు. 

మ‌నం యుద్ధం చేస్తుంది చంద్ర‌బాబు ఒక్క‌రితోనే కాదు.. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5తో, ఇంకా అనేకంగా ఉన్న అమ్ముడుపోయిన ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామ‌ని మ‌ర్చిపోవ‌ద్దు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది చంద్ర‌బాబు కుట్ర‌ల్లో భాగంగా చాలా పెద్ద కుట్ర చేయ‌బోతున్నాడు. ప్ర‌తి గ్రామానికి మూట‌ల మూట‌ల డ‌బ్బులు పంపించి ప్ర‌తి చేతిలో రూ. 3 వేలు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. మీ అంద‌రినీ ఒక‌టే కోరుతున్నా.. మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో తిరిగేట‌ప్పుడు ప్ర‌తి అక్క‌, ప్ర‌తి చెల్లి, ప్ర‌తి అన్న‌, ప్ర‌తి అవ్వా,తాత‌ల‌ను క‌ల‌వండి. చంద్ర‌బాబు ఇచ్చే రూ. 3 వేలు తీసుకొని మోస‌పోవ‌ద్దు అక్కా.. 20 రోజులు ఓపిక ప‌ట్టు అక్కా.. అన్ను ముఖ్య‌మంత్రి చేసుకుందాం. అన్న ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత మ‌న పిల్ల‌ల‌ను కేవ‌లం బ‌డుల‌కు పంపిస్తే చాలు అన్న ప్ర‌తి అక్క చేతిలో రూ. 15 వేలు పెడ‌తాడ‌ని చెప్పండి. 

మ‌న పిల్ల‌ల‌ను ఇంజ‌నీర్లుగా, డాక్ట‌ర్లుగా చ‌దివించ‌గ‌లుగుతున్నామా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదు అక్కా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నాం.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను పెద్ద చదువులు ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న ఉచితంగా చదివిస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్ర‌తి అక్క‌కు, ప్ర‌తి చెల్లికి చెప్పండి చంద్ర‌బాబు ఇచ్చే రూ. 3 వేల‌కు మోస‌పోవ‌ద్దు అని చెప్పండి. ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. ఒక్క రూపాయి మాఫీ చేసిన ప‌రిస్థితి లేదు. గ‌తంలో మ‌న‌కు సున్నావడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత సున్నావడ్డీ ఎగరగొట్టాడు. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత పొదుపు సంఘాల్లో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఉన్న రుణాలన్నీ మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతిచెల్లెమ్మకు చెప్పండి. మ‌ళ్లీ సున్నా వ‌డ్డీకి రుణాలు వ‌చ్చేది జ‌గ‌న‌న్న‌తోనే సాధ్య‌మ‌ని చెప్పండి.

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్య‌మంత్రి అయిన త‌రువాత‌ వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంట‌కు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. 20 రోజులు ఓపిక‌ప‌ట్టు అన్న‌.. ఆ త‌రువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబ‌డుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్నముఖ్య‌మంత్రి అయిన త‌రువాత గిట్టుబాటు ధ‌ర‌లు ఇవ్వ‌డ‌మే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్ష‌న్ వ‌చ్చేది కాద‌ని, లేక‌పోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్ర‌తి అవ్వ‌ను అడగండి. ఆ అవ్వకు, ప్ర‌తి తాత‌కు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. 20 రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి.

ఇల్లులేని ప్ర‌తి నిరుపేద‌కు చెప్పండి. ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో ఇల్లు లేదు. క‌ట్టిస్తాన‌న్న మాట పోయింది. 20 రోజులు ఓపిక ప‌ట్టు అన్నా.. అన్న‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుందాం. అక్ష‌రాల 25 ల‌క్ష‌ల ఇళ్లులు క‌ట్టిస్తాడ‌ని చెప్పండి. రాజ‌న్న రాజ్యంలో ఇళ్లులు క‌ట్ట‌డం చూశాం. మ‌ళ్లీ జ‌గ‌న‌న్నతోనే అది సాధ్య‌మ‌ని ఇల్లులేని ప్ర‌తి నిరుపేద‌కు చెప్పండి. న‌వ‌ర‌త్నాల్లోని ప్ర‌తి అంశం ప్ర‌తి కుటుంబంలోకి తీసుకొనిపోండి. చెడిపోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లోకి మార్పురావాలి. చెడిపోయిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో విశ్వ‌స‌నీయ‌త అనే ప‌దం తెలిసిన వ్య‌క్తి ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చొని ఉండాల‌ని ప్ర‌తి ఇంట్లో చెప్పండి. మార్పు తీసుకువ‌చ్చే దిశ‌గా మీ అంద‌రి చ‌ల్ల‌ని ఆశీస్సులు కోరుతూ..  మ‌న పార్టీ త‌రుఫున ఐజ‌య్య ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నిల‌బ‌డుతున్నాడు.. మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌లు, ఆశీస్సులు గున్న‌మ‌ట్ల ఎలీజాపై ఉంచాల‌ని కోరుతున్నాను. అదే విధంగా ఎంపీ అభ్య‌ర్థిగా శ్రీ‌ధ‌ర్‌ను నిల‌బెడుతున్నాను.. మంచివాడు, సౌమ్యుడు, మంచిచేస్తాడ‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌లు, ఆశీస్సులు శ్రీ‌ధర్‌పై ఉంచాల‌ని పేరు పేరునా కోరుతున్నాను. చివ‌ర‌గా మ‌న గుర్తు ఫ్యాన్ అని ఎవ‌రూ మ‌ర్చిపోవ‌ద్దు. 

Back to Top