పరిపాల‌న‌పై దృష్టి సారించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

రేపటి నుంచి వైయ‌స్‌ జగన్‌ సమీక్షలు

జూన్ 8న స‌చివాల‌యానికి కొత్త సీఎం

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనపై దృష్టి పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్న భోజన పథకంపై అక్షయపాత్ర ట్రస్ట్, ఉన్నతాధికారులతో సీఎం చర్చలు జరిపారు. రేపటి నుంచి శాఖల వారీగా ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ సమీక్షలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం ఆర్థిక, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరపనున్నారు. జూన్‌ 3న విద్యా, జలవనరుల శాఖలపై సమీక్ష జరుపుతారు. 4న వ్యవసాయం, గృహనిర్మాణ శాఖలపై సమీక్ష ఉంటుంది. 6న సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జూన్‌ 8న సచివాలయంలో సీఎం వైయ‌స్‌ జగన్‌ అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8.39 గంటలకు ముఖ్యమంత్రి చాంబర్‌లోకి ప్రవేశించనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top