తిరుమల చేరుకున్న వైయ‌స్‌ జగన్‌.. 

 తిరుపతి: సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్ ఒక సామాన్య భక్తుడిలా అలిపరి మార్గంలో కాలినడకన ముందుకు సాగిన జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల చేరుకున్నారు.  మరికాసేపట్లో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి వైయ‌స్‌ జగన్‌ శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. మధ్యాహ్నం పద్మావతి గెస్ట్‌హౌస్‌ నుంచి అలిపిరి చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడి నుంచి కాలినడక మార్గంలో తిరుమలకు బయలుదేరారు.

పెద్దసంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా మెట్లమార్గం గోవింద నామస్మరణతో మార్మోగింది. అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లకు మెక్కి నడక ప్రారంభించిన జననేత.. అడుగడుగునా భక్తులకు అభివాదం చేస్తూ.. సామాన్య భక్తుడిలా ముందుకుసాగారు. మార్గమధ్యలో ఆంజనేయస్వామిని దర్శించుకుని.. కొబ్బరికాయ కొట్టారు. వడివడిగా మెట్లు ఎక్కిన వైయ‌స్‌ జగన్‌ ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపులేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత.. తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు.

మెట్ల దారిలో సాటి భక్తులను పలుకరిస్తూ.. వారికి ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జననేత.. మర్గమధ్యలో నరసింహా ఆలయం మీదుగా మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు వైయ‌స్‌ జగన్‌ తీసుకోనున్నారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్నారు.
 

Back to Top