కడప ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైయస్‌ జగన్‌

జననేతకు పార్టీ నాయకులు ఘన స్వాగతం

 
వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన అన్న పిలుపు, సమర శంఖారావం కార్యక్రమాల్లో వైయస్‌జగన్‌ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎయిర్‌పోర్టులో జననేతకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
 

Back to Top