కాసేప‌ట్లో పులివెందులకు వైయ‌స్‌ జగన్‌

వైయ‌స్ఆర్ జిల్లా : వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాసేప‌ట్లో పులివెందుల‌కు చేరుకుంటారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత వైయ‌స్ అభిషేక్ రెడ్డి  తీవ్ర అనారోగ్యంతో  హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న అంత్యక్రియలు ఇవాళ పులివెందులలో జరగనున్నాయి. ప్రస్తుతం స్వగృహంలో పార్టీ శ్రేణుల సందర్భనార్థం పార్థీవదేహాన్ని ఉంచారు. మధ్యాహ్నాం అంతిమయాత్ర మొదలుకానుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరికాసేపట్లో అక్కడికి చేరుకుని నివాళులర్పించనున్నారు. 
 

Back to Top