ఉద్యోగులకు వైయస్‌ జగన్‌ వరాల జల్లు

రేపటి కేబినెట్‌లో 27 శాతం ఐఆర్, సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం

సచివాలయం ఉద్యోగులతో వైయస్‌ జగన్‌ సమావేశం

అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్‌ రద్దుపై రేపటి కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్‌ హాల్‌లో సచివాలయం ఉద్యోగులతో వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే మీ అందరి సహకారం కావాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారన్నారు. గత ప్రభుత్వంలో సన్నిహితంగా ఉన్నారని నేనెవరినీ తప్పుపట్టనని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top