గండి వీరాంజనేయస్వామి ఆలయంలో సీఎం పూజలు

పులివెందుల: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల గండి వీరాంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం వైయస్‌ జగన్‌కు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న జననేత వీరాంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంట కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, మంత్రులు, పార్టీ నాయకులు ఉన్నారు. 
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి 70వ జయంతిని పురస్కరించుకొని ఆంధ్రరాష్ట్రమంతా రైతు దినోత్సవాన్ని జరుపుకుంటుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి రైతు దినోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొంటారు. కడపలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొని శంకుస్థాపనలు చేస్తారు.

Back to Top