వైయ‌స్‌ఆర్‌ ఘాట్‌ వద్ద వైయ‌స్‌ జగన్‌ నివాళులు

వైయ‌స్ఆర్‌ : సంక్షేమ ప్రదాత.. అభివృద్ధి విధాత.. మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖర్‌రెడ్డి 15వ వర్ధంతి సంద‌ర్భంగా  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌ కుటుంబ సభ్యుల‌తో క‌ల‌సి నివాళుల‌ర్పించారు. ఇడుపులపాయలోని  వైయ‌స్ఆర్ ఘాట్‌ వద్ద ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌ సతీమణి విజయమ్మ, తనయుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయ‌స్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు.


 
కార్యక్రమంలో ఎంపీలు వైయ‌స్‌ అవినాష్ రెడ్డి, గురుమూర్తి, జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి,  దాసరి సుధ, మాజీ డిప్యూటీ  సిఎం ఆంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top