అట్టహాసంగా వైయస్‌ జగన్‌ నామినేషన్‌

సర్వమత ప్రార్థనలు, తల్లి ఆశీర్వాదం

వేలాదిగా తరలివచ్చిన వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు, అభిమానులు

 

పులివెందుల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్‌ అట్టహాసంగా సాగింది. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలిరావడంతో పులివెందుల జనసంద్రమైంది. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం వైయస్‌ జగన్‌ సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం చర్చి పాస్టర్లు, తల్లి వైయస్‌ విజయమ్మ జననేతను ఆశీర్వదించారు. అలాగే మసీద్‌లో దువా చేశారు. అనంతరం వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి వైయస్‌ జగన్‌ నామినేషన్‌ వేసేందుకు తరలివచ్చారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి వైయస్‌ జగన్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు. 

Back to Top